బ్లాక్ బస్టర్ మూవీతో 2019ని స్టార్ట్ చేసిన దిల్ రాజు

2018లో నిర్మాత దిల్ రాజుకి అదృష్ణం అస్సలు కలిసిరాలేదు. డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాలతో పాటు నిర్మాతగా తెరకెక్కించిన లవర్, శ్రీనివాస కళ్యాణం, హలోగురూ ప్రేమకోసమే సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే ఈ ఏడాది స్టార్టింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2తో అనుకున్నట్లుగానే వంద కోట్ల వసూళ్లు రాబట్టి భారీ లాభాల్ని మిగిల్చింది. దీంతో 2019ని గ్రాంఢ్ గా స్టార్ట్ చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు అదే ఊపుని ఈ ఏడాదంతా కొనసాగించేందుకు ట్రై చేస్తున్నాడు. స్టార్ అండ్ యంగ్ హీరోలతో గ్యాప్ లేకుండా సినిమాలు నిర్మించేందుకు మంచి ప్లానింగ్ తో రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది దిల్ రాజు ప్రొడక్షన్ లో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఆడియన్స్ ముందుకి రానున్నాయి.
దిల్ రాజు నిర్మాణంలో ఈ ఏడాది ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. అనిల్ రావిపూడి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమాని ప్రొడ్యూసర్ అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మించబోతున్నాడు. మే 9న రిలీజ్ కానున్న మహర్షి సినిమా నిర్మాణంలో కూడా పివిపి, అశ్వినీదత్ తో కలిసి దిల్ రాజు పనిచేస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాలే కాకుండా సమంతా, శర్వానంద్ కాంబినేషన్ లో తమిళ్ హిట్ మూవీ 96ని రీమేక్ చేయనున్నాడు. ఏప్రిల్ 6న ఈ సినిమా ప్రారంభం కానుంది.
ఎఫ్ 2 సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ 3ని నిర్మించనున్నట్లు దిల్ రాజు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎఫ్ 3 రిలీజ్ కానుంది. దీంతోపాటు ప్రభాస్, సమంతా హీరో, హీరోయిన్ గా కలిసి మొదటిసారి ఓ సినిమాని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఈ ఏడాది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా సత్తాచాటేందుకు దిల్ రాజు గట్టిగా ట్రై చేస్తున్నాడు.