Family Star : దివ్యాంగురాలైన మహిళను కలిసిన ‘ఫ్యామిలీ స్టార్’ టీం.. ఆమె కథ వినాల్సిందే.. నిజమైన ఫ్యామిలీ స్టార్ అంటూ..
తెలుగు రాష్ట్రాల్లో అలాంటి కొంతమంది ఫ్యామిలీ స్టార్స్ ని మేము కలుస్తాము అని దిల్ రాజు ఇటీవల తెలిపారు.

Dil Raju Vijay Deverakonda Family Star Movie Team Meets Physically Challenged Women Who Supports Her Family
Family Star : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. పలువురు సోషల్ మీడియాలో ఈ సినిమాని నెగిటివ్ గా ప్రమోట్ చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చింది. థియేటర్స్ లో ఫ్యామిలీ స్టార్ సినిమాని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఒక మాములు మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో ఎవరో ఒకరు ఆ ఫ్యామిలీ బాధ్యత తీసుకొని, ఫ్యామిలీ కోసం కష్టపడి. ఫ్యామిలీ స్థాయిని పెంచిన వ్యక్తులు ఫ్యామిలీ స్టార్ గా ఉంటారు. అలాంటి వాళ్లదే ఈ కథ అని ప్రమోట్ చేశారు. సినిమాలో హీరో తన ఫ్యామిలీని ఎలా చూసుకున్నాడు, ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడ్డాడు, ఎలా ఎదిగాడు అని ఒక మంచి పాయింట్ ని చూపించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఫ్యామిలిలో ఫ్యామిలీ కోసం ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి కొంతమంది ఫ్యామిలీ స్టార్స్ ని మేము కలుస్తాము అని దిల్ రాజు ఇటీవల తెలిపారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్‌కి ఇంకో ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఉందా? ఓన్లీ ఫ్యామిలీ కోసం.. లీక్ చేసిన ఉపాసన..
ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా మీమర్స్ మీట్ జరగ్గా ఓ మీమర్ మాట్లాడుతూ.. మా ఇంట్లో ఫ్యామిలీ స్టార్ మా చెల్లి. పుట్టినప్పటి నుంచి ఆమె కొంచెం ఫిజికల్ గా వీక్. తను నడవలేదు. కానీ ఆమె డిగ్రీ చేసింది, అమెజాన్ లో జాబ్ సాధించింది. అమెజాన్ లో జాయిన్ అయ్యే ముందు ఒక షాప్ తీసుకొని జనరల్ స్టోర్స్ పెట్టి నడిపించింది. మా ఇంటికి చాలా సపోర్ట్ గా నిలిచింది అని తెలిపాడు. దీంతో అతని మాటలకు దిల్ రాజు ఎమోషనల్ అయి త్వరలో వచ్చి కలుస్తాము మీ ఫ్యామిలీ స్టార్ ని అని తెలిపాడు.
Team of #TheFamilyStar meets and salutes a real life FAMILY STAR ✨
The movie is all about celebrating our dearest ones, our family stars ❤?
Book your tickets for the perfect ?????? ?????? ??????????? now!
?️ https://t.co/lBtal2uGnv@TheDeverakonda… pic.twitter.com/18wi88fPwf— Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2024
తాజాగా విజయ్ దేవరకొండ, దిల్ రాజు(Dil Raju), డైరెక్టర్ పరుశురాం ముగ్గురు కలిసి ఆ మీమర్ ఇంటికి వెళ్లి వాళ్ళ చెల్లిని కలిశారు. ఆమె ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలిచిన విధానాన్ని అభినందించారు. స్వరూప అనే ఆ దివ్యంగురాలితో విజయ్ కాసేపు మాట్లాడాడు. మూవీ టీం అంతా కూడా ఆ ఫ్యామిలీతో ముచ్చటించింది. ఫ్యామిలీ స్టార్ సినిమా బాగుందని ఆ ఫ్యామిలీ కూడా చెప్పింది. ఫ్యామిలీ స్టార్ మూవీ టీం వెళ్లి ఆ ఫ్యామిలీని కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంలో దిల్ రాజుని, విజయ్ దేవరకొండని అంతా అభినందిస్తున్నారు. త్వరలోనే మరింతమంది ఫ్యామిలీలను కలవనున్నారు.