Dimple Hayathi: పూజలతో స్టార్స్ అయిపోరు.. వేణు స్వామిపై డింపుల్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ డింపుల్ హయతి(Dimple Hayathi) వేణు స్వామిపై డింపుల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. పూజల వల్ల సక్సెస్ రాదు అని తేల్చి చెప్పేసింది.

Dimple Hayathi: పూజలతో స్టార్స్ అయిపోరు.. వేణు స్వామిపై డింపుల్ షాకింగ్ కామెంట్స్

Dimple Hayathi shocking comments about Venu Swamy.

Updated On : January 4, 2026 / 1:42 PM IST
  • పూజలు చేస్తే స్టార్స్ అవుతారు అనేది నేను నమ్మను.
  • ఎవరో ఎదో అన్నారనని ఏవి జరిగిపోవు
  • వేణు స్వామిపై డింపుల్ షాకింగ్ కామెంట్స్

Dimple Hayathi: టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవి తేజ క్లాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల టెకెక్కిస్తున్నాడు. ఆషిక రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Riddhi Kumar: అందం హద్దులు చెరిపేస్తున్న రిద్ది కుమార్.. గ్లామర్ ఫొటోస్

ఇందులో భాగంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ హయతి(Dimple Hayathi) వేణు స్వామి గురించి, తాను జరిపించిన పూజలపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.. ‘కేవలం పూజల వల్ల స్టార్స్ అయిపోతారు అంటే నేను నమ్మను. నేను, మా రెగ్యులర్ గా గుడికి వెళ్తాము. పెద్దవాళ్ళు చెప్పారని పూజలు కూడా చేస్తాము.

దేనికైనా సమయం రావాలి. అప్పుడే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎవరో ఏదో అన్నంత మాత్రాన, పూజలు చేసినంత మాత్రాన ఇక్కడ కెరీర్ మారిపోవడం అనేది జరగదు. ఇక్కడ కావాల్సింది కష్టం, ఓపిక అంతే. అయినా నేను ఏంటి అనేది నావాళ్ళకి తెలుసు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో డింపుల్ వేణు స్వామిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక గతం లో డింపుల్ వేణు స్వామితో పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే.