వ్యాఖ్యల రగడ : భాగ్యరాజాపై చిన్మయి శ్రీపాద ఆగ్రహం

  • Published By: madhu ,Published On : November 27, 2019 / 08:56 AM IST
వ్యాఖ్యల రగడ : భాగ్యరాజాపై చిన్మయి శ్రీపాద ఆగ్రహం

Updated On : November 27, 2019 / 8:56 AM IST

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు భాగ్య రాజ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతోంది. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రేప్‌లు, లైంగిక దాడులకు మహిళలే కారణం అన్న రీతిలో భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై సెలబ్రెటీలు, ఇతర ప్రముఖులు స్పందిస్తున్నారు. వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఖండించారు. 

2019, నవంబర్ 27వ తేదీ బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ..సినీ పరిశ్రమ పెద్దలు చెప్పడం బాధాకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతోనే అమ్మాయిలు చనిపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కరుత్తుగలై పదివుసెయ్ సినిమా ఆడియో విడుదల సందర్భంగా..భాగ్యరాజ్ మహిళలపై అభ్యంతకరంగా మాట్లాడారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ ఫోన్‌లో ఉంటున్నారు. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని నోరు పారేసుకున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారని భాగ్యరాజా అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు..పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భాగ్యరాజ. వస్తున్న విమర్శలపై భాగ్యరాజ..వెనక్కి తగ్గుతారా ? క్షమాపణలు చెబుతారా ? అనేది చూడాలి. 
Read More : భాగ్యరాజాను చెప్పుతో కొట్టాలి : రేప్ లకు కారణం మహిళలేనట