NBK109 : యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు కాబోతున్న బాలయ్య, బాబీ మూవీ.. అప్డేట్స్ ఏంటంటే..?
బాలయ్య, బాబీ మూవీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు కాబోతుంది. NBK109 అప్డేట్స్ ఏంటంటే..?

Director Bobby Balakrishna NBK109 movie shooting updates
NBK109 : నందమూరి నటసింహం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించి ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. కేవలం హ్యాట్రిక్ విజయం మాత్రమే కాకుండా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో 100 కోట్ల క్లబ్ లోకి కూడా బ్యాక్ టు బ్యాక్ ఎంట్రీ ఇచ్చి సీనియర్ హీరోల్లో రికార్డు సృష్టించాడు. భగవంత్ కేసరి సినిమా థియేటర్స్ లో ఇంకా కలెక్షన్స్ దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్తుంది. ఇక బాలకృష్ణ తన కొత్త సినిమాని పట్టాలు ఎక్కించే పనిలో పడ్డాడు. బాలయ్య తన నెక్స్ట్ మూవీని బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాబీ.. ఇప్పుడు బాలయ్యకి కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 6న ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. మొదటి షెడ్యూల్ నే యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టబోతున్నారు. దాదాపు 20 రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్ ఊటీలో ప్లాన్ చేశారట. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకి పని చేయబోతున్నారట. ఈ చిత్రం పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.
Also read : Bharateeyudu 2 : ‘భారతీయుడుని’ మళ్ళీ తీసుకు వచ్చిన రాజమౌళి.. ఇండియన్ 2 టీజర్ చూశారా..!
మరి బాబీ ఆ అంచనాలు రీచ్ అయ్యి.. మెగా అభిమానులను ఖుషి చేసినట్లు, నందమూరి అభిమానుల కూడా ఖుషి చేస్తాడేమో చూడాలి. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. 1980లో స్టోరీతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటూ సినిమాని ప్రకటించారు. ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో ఫస్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.