Parasuram : ఆరు కోట్లకు ఏడు కోట్లు వడ్డీ కట్టిన డైరెక్టర్.. సినిమా చేయకుండా జంప్ అయినందుకు భారీ నష్టం..

పరశురామ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. మూడేళ్ల క్రితం నాగచైతన్య(Naga Chaitanya)తో కమిట్ అయిన సినిమాకు సంబందించి 14 రీల్స్ నుంచి 6 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు పరశురామ్.

Parasuram : ఆరు కోట్లకు ఏడు కోట్లు వడ్డీ కట్టిన డైరెక్టర్.. సినిమా చేయకుండా జంప్ అయినందుకు భారీ నష్టం..

Director Parasuram pays 6 crores debt with 7 crores interest to 14 reels Productions

Updated On : June 6, 2023 / 11:44 AM IST

Director Parasuram :  అప్పుడెప్పుడో ఒక సినిమా కమిట్ అయ్యాడు డైరెక్టర్ పరుశురాం. 6 కోట్లు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అంతలోనే స్టార్ హీరోతో సినిమా అని జంప్ అయిపోయాడు. ఇప్పుడు పరశురామ్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. ఆల్రెడీ కెరీర్ లో మంచి బ్రేక్ ఇచ్చిన అల్లు అరవింద్(Allu Aravind) కి హ్యాండ్ ఇచ్చి ఆల్రెడీ బుక్ అయిన పరశురామ్ కి ఇప్పుడు 14 రీల్స్ నిర్మాణ సంస్థ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అప్పుడెప్పుడో తీసుకున్న 6 కోట్ల అసలుకి వడ్డీ కూడా కలిపి కట్టాల్సొచ్చింది. అది అక్షరాలా 13 కోట్లు. 6 కోట్ల అసలుకి వడ్డీ 7 కోట్లతో ఇచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చెయ్యాల్సొచ్చింది పరశురామ్.

పరశురామ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. కొన్నేళ్ల క్రితం నాగచైతన్య(Naga Chaitanya)తో కమిట్ అయిన సినిమాకు సంబందించి 14 రీల్స్ నుంచి 6 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు పరశురామ్. సినిమా ఓపెనింగ్ కూడా అనుకున్నారు. ఇంకేముంది షూటింగే లేటు అనుకుంటున్న టైమ్ లో పరశురామ్ మహేష్ బాబు సినిమా అఫరొచ్చిందని అటు జంప్ అయిపోయాడు. దాంతో అటు నాగచైతన్య, ఇటు నిర్మాణ సంస్థ వెయిట్ చెయ్యాల్సొచ్చింది.

Sreeleela : రామ్ బోయపాటి సినిమా లాస్ట్ షెడ్యూల్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? శ్రీలీల స్పెషల్ పోస్ట్..

ఆ తర్వాత ఈక్వేషన్స్ మారిపోవడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఇక రీసెంట్ గా అల్లు అరవింద్ ఓ ప్రెస్ మీట్ లో పేరు చెప్పకుండా పరుశురాం ఆఫర్ ఇచ్చినా వెయిట్ చేయకుండా జంప్ అయ్యాడు అని అన్నారు. ఇక 14 రీల్స్ డబ్బులు కట్టాల్సిందే అని పట్టుబడటంతో పరశురామ్ దెబ్బకి దిగొచ్చి అడ్వాన్స్ కి వడ్డీతో సహా కలిపి 13 కోట్లు కట్టాల్సొచ్చింది. అయితే పరశురామ్ కి ఈ సెటిల్మెంట్ లో హెల్ప్ చేసి పెట్టింది మరో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెమ్యునరేషన్ తో పాటు మిగిలింది దిల్ రాజు దగ్గర తీసుకొని లెక్కలు తర్వాత చూసుకుందామని పరుశురాం ఆ అప్పు తీర్చేసినట్టు సమాచారం. మొత్తానికి 6 కోట్లకు 7 కోట్లు వడ్డీ కట్టి భారీ నష్టాన్ని మిగుల్చుకున్నాడు పరుశురాం. దీంతో టాలీవుడ్ లో అంతా పరుశురాం గురించే చర్చించుకుంటున్నారు.