లక్ష్మీస్ NTR : నేడు వర్మ ప్రెస్ మీట్
లక్ష్మీస్ NTR సినిమా ఒక్క ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29వ తేదీ రిలీజ్ కాబోతోంది.

లక్ష్మీస్ NTR సినిమా ఒక్క ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29వ తేదీ రిలీజ్ కాబోతోంది.
లక్ష్మీస్ NTR సినిమా ఒక్క ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29వ తేదీ రిలీజ్ కాబోతోంది. సినిమాను విడుదల చేయొద్దని..తమ మనోభావాలు దెబ్బతింటాయని హైకోర్టులో ఇద్దరు వ్యక్తులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 15 వరకు సినిమా విడుదల ఆపేయాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఏపీలో సినిమా విడుదలపై స్టే విధించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
దీనిపై చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ 2019 మార్చి 29వ తేదీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే వర్మ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ కూడా విడుదల చేశారు. దీంతోపాటు సినిమాలో ఎన్ని డైలాగులు మ్యూట్ చేశారనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. మరి చూడాలి ఈ రోజు ఈ సినిమా వివాదం ఏ మలుపు తీసుకుంటుందో.
ఈ సినిమాలో చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ.. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి ఆయన మానసిక క్షోభకు కారణం అయ్యారని, వాస్తవ ప్రపంచానికి తెలియని విషయాలను సినిమాలో చూపించబోతున్నానని ప్రకటించి సినిమాపై అంచనాలను పెంచేశారు ఆర్జీవీ. నటుడు విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా.. యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతిగా నటిస్తుంది. చంద్రబాబుగా శ్రీతేజ్.. బాలయ్యగా ఆర్.జె.బాలు నటించారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష