Rajamouli : ఎయిర్ పోర్ట్ యాజమాన్యానికి రాజమౌళి స్వీట్ వార్నింగ్..

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ యాజమాన్యానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు..

Rajamouli : ఎయిర్ పోర్ట్ యాజమాన్యానికి రాజమౌళి స్వీట్ వార్నింగ్..

Director S S Rajamouli Upset With Delhi Airport Authorities

Updated On : July 2, 2021 / 12:22 PM IST

Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ యాజమాన్యానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్‌గా రాజమౌళి ఢిల్లీ వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాలు తనకు బాధ కలిగించాయని తన అసహనానికిగల కారణాలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు జక్కన్న.

‘డియర్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్.. నేను లుఫ్తానస(Lufthanasa) ఎయిర్‌వేస్‌లో రాత్రి ఒంటి గంట టైంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ చేరుకున్నాను. అక్కడ సిబ్బంది RTPCR టెస్ట్ కోసం ఫిల్ చెయ్యమని కొన్ని ఫాంస్ ఇచ్చారు. అయితే ఆ ఫాంస్ ఎలా ఫిల్ చెయ్యాలో చెప్పడానికి ఎవరూ లేరు. ఇన్ఫర్మేషన్ కనీసం వాల్స్ మీద నోటీస్ లాంటిది ఉంటుందేమోనని చూశాను కానీ అటువంటిదేం కనిపించలేదు’.

‘ఇక ఎగ్జిట్ గేట్ దగ్గర వీధి కుక్కలు గుంపులుగా కనిపించాయి. విదేశాలనుండి మన దేశానికి వచ్చే వారికి ఇలాంటి దృశ్యాలతో స్వాగతం పలకడం అనేది మన దేశ గౌరవానికి మంచిది కాదు. ఇలాంటి సంఘటనలపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాను..’ అంటూ జక్కన్న ఢిల్లీ ఎయిర్ పోర్ట్ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.