Ram Charan: RC15కి డైరెక్టర్ శంకర్ ‘జీరో’ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడట.. నిజమేనా?
RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ తన తదుపరి చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న విషయం మనకి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరించుకుంటున్నఈ సినిమాపై సౌత్ లోనే కాదు నార్త్ లోను మంచి హైప్ సంపాదించుకుంది. అయితే డైరెక్టర్ శంకర్ సినిమాలని భారీగా నిర్మించడమే కాదు అతని తీసుకునే పారితోషకం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కాగా ఇప్పుడు చేస్తున్న RC15 గాను.....

Director Shankar takes Zero Remuneration for RC15
Ram Charan: RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ తన తదుపరి చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న విషయం మనకి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సౌత్ లోనే కాదు నార్త్ లోనూ మంచి హైప్ సంపాదించుకుంది. శంకర్ సినిమా అంటే దాదాపు 2-3ఏళ్ళు షూటింగ్ జరుపుకోవడం ఖాయం, కానీ దానికి విరుద్ధంగా శంకర్ ఈ సినిమాని శరవేగంగా చిత్రీకరిస్తున్నాడు.
RC15 First Look: ఫస్ట్ లుక్ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న శంకర్..?
ఇక కమల్ హాసన్, శంకర్ కలయికలో వస్తున్న “భారతీయుడు-2” అన్ని అడ్డంకులు దాటుకుని ఇటీవలే షూటింగ్ కి రెడీ కాగా, ఈ సినిమా కోసం శంకర్ RC15 కి కొంత గ్యాప్ ఇచ్చాడు. అయితే డైరెక్టర్ శంకర్ సినిమాలని భారీ స్థాయిలో నిర్మించడమే కాదు అతను తీసుకునే పారితోషకం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కాగా ఇప్పుడు చేస్తున్న RC15 గాను శంకర్ ‘జీరో’ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి.
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీపై ఒకటే మ్యూజిక్కు.. నిజమేనా?
అయితే అసలు విషయమేమిటంటే డైరెక్టర్ శంకర్ రెమ్యూనిరేషన్ కి బదులుగా సినిమా లాభాల్లో 50% షేర్లు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజమున్నదో మాత్రం తెలియాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజ్ ఈ సినిమాని నిర్మిస్తుండగా రాంచరణ్ సరసన కియారా అద్వానీ మెరవనుంది. శ్రీకాంత్, జయరాం, సునీల్, నవీన్ చంద్రా, అంజలి వంటి తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.