RC15 First Look: ఫస్ట్ లుక్ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న శంకర్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను శంకర్ మార్క్ సోషల్ డ్రామాగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు.

RC15 First Look: ఫస్ట్ లుక్ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న శంకర్..?

RC15 First Look: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను శంకర్ మార్క్ సోషల్ డ్రామాగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

RC15: హైదరాబాద్‌లో దూసుకుపోతున్న చరణ్..!

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ అయినా వస్తుందేమో అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం షూటింగ్ అప్డేట్స్ మాత్రమే వినిపిస్తూ వచ్చాయి. కాగా, ఆగస్టు నెలలో ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా అప్డేట్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చరణ్ నటిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం శంకర్ భారీగానే ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌ను హైదరాబాద్ లేదా దుబాయ్‌లో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

RC15: ఫస్ట్ లుక్‌కి కూడా గ్రాండ్ ఈవెంట్.. శంకరా మజాకా..!

ఇక ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ పోస్టర్ రిలీజ్‌కు టాలీవుడ్ నుండి పలువురు స్టార్ హీరోలు కూడా రాబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించనుంది.