RC15: హైదరాబాద్‌లో దూసుకుపోతున్న చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరగుతోండగా.. కొన్ని కీలక సీన్స్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఇక్కడ తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.

RC15: హైదరాబాద్‌లో దూసుకుపోతున్న చరణ్..!

Ram Charan Movie Shooting In Full Swing In Hyderabad

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ డ్రామాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చరణ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాను దర్శకుడు శంకర్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండియావైడ్‌గా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

RC15: ఫస్ట్ లుక్‌కి కూడా గ్రాండ్ ఈవెంట్.. శంకరా మజాకా..!

ఇక ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తుంటే, ఈ సినిమాలో ఆయన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సీన్స్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఇక్కడ తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనుండటంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

RC15: పొలిటికల్ సాంగ్ అందుకుంటున్న చరణ్..?

శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో చరణ్ మరోసారి పాన్ ఇండియా హీరోగా తనదైన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాలో పలువరు మేటి స్టార్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను వచ్చే మార్చి నాటికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.