Eesha: 16 ఏళ్ళ తరువాత సినిమా చేసిన దర్శకుడు.. రాజు వెడ్స్ రాంబాయి హీరోతో హారర్ మూవీ
ఈషా(Eesha) సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి. హారర్ ఎలిమెంట్స్, చావు, పుట్టుకలు, అండర్ కరెంట్‌లో దైవత్వం, సృష్టి ఇలా చాలా అంశాలు ఉంటాయి. సృష్టి మాత్రమే అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది అనేది స్ట్రాంగ్ కంటెంట్‌గా ఉంటుంది.
Director Srinivas Manne shares interesting facts about Eesha movie
Eesha: ఒకప్పటి స్టార్ బ్యూటీ జెనీలియా ప్రధాన పాత్రలో వచ్చిన ‘కథ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్ మన్నె. ఆ తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘ఈషా(Eesha)’. లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ నిర్మాత బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బాపటేల్ హీరోయిన్ కనిపించనుంది. ఈ సినిమా డిసెంబరు 12న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్బంగా దర్శకుడు శ్రీనివాస్ మన్నె మీడియాతో మాట్లాడుతూ ఈషా సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
Akhanda 2-RajaSaab: అఖండ 2 బాటలోనే రాజాసాబ్.. సంక్రాంతికి రిలీజ్ కష్టమేనా.. ఆందోళనలో ఫ్యాన్స్..
కథ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. జెనీలియాకు నంది అవార్డు కూడా వచ్చింది. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ సినిమా అనేది నాకు డ్రీమ్. అందుకే, ఈ గ్యాప్‌లో చాలా కథలు సిద్దం చేసుకున్నాను. కొరియన్, హాలీవుడ్ సినిమాలు చూడటం నా అలవాటు. మనం చెప్పే కథ స్ట్రాంగ్‌గా ఉంటే టెక్నికల్‌గా అటు ఇటు ఉన్నప్పటికీ సినిమా హిట్ అవుతుంది. ఈషా సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి. హారర్ ఎలిమెంట్స్, చావు, పుట్టుకలు, అండర్ కరెంట్‌లో దైవత్వం, సృష్టి ఇలా చాలా అంశాలు ఉంటాయి. సృష్టి మాత్రమే అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది అనేది స్ట్రాంగ్ కంటెంట్‌గా ఉంటుంది.
ఇక సినిమాలో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది కూడా వాంటెడ్‌గా కాకుండా చాలా సహజంగా భయపెడతాయి, ఆడియన్స్ భయపడతారు. ముందు చెప్పినట్టుగానే హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమా చూడకపోవడం మంచిది. సెన్సారు వాళ్లు చూసి చాలా భయంకరంగా ఉంది. గుడ్ కంటెంట్ అన్నారు. ఫ్రెండ్‌షిప్, హ్యుమన్ ఎమోషన్స్, ఫిలాసఫీకల్‌గా చెప్పే ప్రయత్నం చేశాము. మూడ నమ్మకాలు,ఆత్మల గురించి కూడా ప్రస్తావించాము. మనకు జరగనంత వరకు ఏదైనా మూడ నమ్మకమే. జరిగినప్పుడు మాత్రమే అది నమ్మకంగా మారుతుంది. మంచి, చెడు లాగే అది కూడా. ఇక రాజు వెడ్స్ రాంబాయి హిట్ అవ్వడం అనేది ఖచ్చితంగా మా సినిమాకు ప్లస్ అవుతుంది. హీరో అఖిల్‌తో పాటు అన్నిపాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి” అంటూ చెప్పుకోచ్చాడు. దీంతో ఈషా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే డిసెంబర్ 12 వరకు ఆగాల్సిందే.
