Suman Shetty: సుమన్ శెట్టి ఇంట్లో ఆ డైరెక్టర్ కోసం స్పెషల్ గది.. గదిలో ఆయన ఫోటో.. సుమన్ శెట్టి గురుభక్తికి ఆడియన్స్ ఫిదా

సుమన్ శెట్టి.. తెలుగు ఆడియన్స్ లో ఈ నటుడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు(Suman Shetty). చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

Suman Shetty: సుమన్ శెట్టి ఇంట్లో ఆ డైరెక్టర్ కోసం స్పెషల్ గది.. గదిలో ఆయన ఫోటో.. సుమన్ శెట్టి గురుభక్తికి ఆడియన్స్ ఫిదా

Director Teja makes emotional comments about Suman Shetty

Updated On : September 17, 2025 / 2:12 PM IST

Suman Shetty: సుమన్ శెట్టి.. తెలుగు ఆడియన్స్ లో ఈ నటుడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో చేయడం తగ్గించిన సుమన్ శెట్టి బిగ్ బాస్ సీజన్ 9లో ఎంట్రీ ఇచ్చాడు. తన స్టైల్లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో సుమన్ శెట్టి ఆటలు ఆడింది, మాటలు మాట్లాడింది చాలా తక్కువ కానీ, బయట ఆయన ఫాలోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్లో పెరుగుతోంది. ఓటింగ్ కూడా ఒక రేంజ్ లో జరుగుతుంది. లాస్ట్ వీక్ జరిగిన ఓటింగ్ లో ఆయన టాప్ లో నిలిచాడు. అంతలా ఆడియన్స్ ఆయన్ని ఇష్టపడుతున్నారు. దాంతో, సుమన్ శెట్టి(Suman Shetty) కూడా ఆడియన్స్ అంచనాలను మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు.

Nagarjuna: కింగ్ నాగ్ 100వ సినిమా.. దసరాకి గ్రాండ్ లాంచ్.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఇదిలా ఉంటే, నటుడు సుమన్ శెట్టి గురించి డైరెక్టర్ తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ సుమన్ శెట్టి గురించి మాట్లాడుతూ.. సుమన్ శెట్టి ఒకరోజు వచ్చి మీరు నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు మీ ఋణం ఎలా తీర్చుకోవాలి గురువుగారు అని అడిగాడట. దానికీ తేజ.. ఋణం అని పెద్ద మాటలు ఎందుకులే గానీ, నీకు ఇంకా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి ముందు ఒక ఇల్లు కొనుక్కో అని చెప్పాడట. తరువాత, కొంతకాలానికి గురువుగారు మీవల్లే నేను ఇల్లు కట్టుకున్నాను, మంచి స్థాయిలో ఉన్నాను మీ ఋణం ఎలా తీర్చుకోవాలి అని కాళ్ళు పట్టుకొబోయాడట.

దానికి తేజ, ఋణం తీర్చుకోవడం కాదు కానీ, నాకు సినిమా అవకాశాలు రాక, నన్నెవరూ పట్టించుకోక రోడ్డున పడిపోతే నేను ఉండటానికి మీ ఇంట్లో ఒక రూమ్ నాకోసం పెట్టు అన్నారట. దాంతో, తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తేజ చెప్పిన విధంగా తన ఇంట్లో ప్రత్యేకమైన గదిని ఆయన కోసం అలాగే ఉంచాడట. ఆ గదిలో తేజ ఫోటోను కూడా పెట్టుకున్నాడట సుమన్ శెట్టి. తన గురువు పట్ల సుమన్ శెట్టికి ఉన్న గౌరవానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం తేజ సుమన్ శెట్టి గురించి చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.