ప్రియాంక రెడ్డి నిందుతులను కఠినంగా శిక్షించాలి : వి.వి.వినాయక్
ప్రియాంక రెడ్డి ఘటనపై దర్శకులు వి.వి.వినాయక్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు..

ప్రియాంక రెడ్డి ఘటనపై దర్శకులు వి.వి.వినాయక్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ కేసులో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమ దర్యాప్తులో హత్యకు ముందు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు.
ఈ సంఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక రెడ్డి ఘటనపై దర్శకులు వి.వి.వినాయక్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘రిప్ ప్రియాంక రెడ్డి.. ఈ కేసుతో ప్రమేయమున్న నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలి’ అని వినాయక్ ట్వీట్ చేశారు. నిందితులు మహబూబ్‌నగర్, రంగారెడ్డి వాసులుగా గుర్తించారు పోలీసులు.
ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి పరామర్శించారు. తప్పు చేసిన వాళ్లకి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ చెప్పారు. ప్రియాంకరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
#RIPPriyankaReddy Please punish all that basterd who r involved in this case as soon as possible pic.twitter.com/2LvXpVS4uq
— VV Vinayak (@VVVinayakOnline) November 29, 2019