Crazy Combinations: కలిసొచ్చిన హీరోలతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్స్

బ్లాక్ బస్టర్స్, యావరేజ్, ఫ్లాప్స్ ఇలా ఎప్పటిలాగానే మిక్స్ డ్ టాక్ వినిపించింది టాలీవుడ్ లో. బట్ కొన్ని సంవత్సరాలుగా ఫెయిల్యూర్ ఫేస్ చేస్తోన్న డైరెక్టర్స్.. వాళ్లకి కలిసొచ్చిన..

Crazy Combinations: కలిసొచ్చిన హీరోలతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్స్

Crazy Combinations

Updated On : January 1, 2022 / 9:32 PM IST

Crazy Combinations: బ్లాక్ బస్టర్స్, యావరేజ్, ఫ్లాప్స్ ఇలా ఎప్పటిలాగానే మిక్స్ డ్ టాక్ వినిపించింది టాలీవుడ్ లో. బట్ కొన్ని సంవత్సరాలుగా ఫెయిల్యూర్ ఫేస్ చేస్తోన్న డైరెక్టర్స్.. వాళ్లకి కలిసొచ్చిన వాళ్లతో కలిసొచ్చిన హీరోలతో మాసివ్ హిట్ కొట్టారు. కొంతమంది కొత్త దర్శకులు బంపర్ సక్సెస్ తో విపరీతంగా పాపులర్ అయ్యారు. ఓటీటీ రిలీజ్ ల ద్వారా పేరుతెచ్చుకున్న వాళ్లూ ఉన్నారు. 2021లో హిట్ కాంబినేషన్స్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాయి. డైరెక్టర్-హీరో కలిస్తే ప్రభంజనమే అన్న నమ్మకాన్ని ఫ్యాన్స్ లో నిలబెట్టాయి.

KishanReddy meets Sai Tej:నటుడు సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి

ఇయర్ స్టార్టింగ్ లో క్రాక్ తో వాళ్ల జోడీకున్న ఎనర్జీని చూపించారు రవితేజ-గోపీచంద్ మలినేని. కొన్ని సంవత్సరాలు సరైన హిట్ లేకుండా బాధపడుతున్న వీళ్లిద్దరూ కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. సింహా, లెజెండ్ తర్వాత అఖండతో ఇలాంటి సక్సెస్ నే టేస్ట్ చేశారు బాలకృష్ణ-బోయపాటి. కొవిడ్ టైమ్ లో నాలుగు వారాలు దాటి ఇంకా ఆడుతుందంటే అఖండ ఇంపాక్ట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ సక్సెస్ లను ఎంజాయ్ చేస్తోన్న సుకుమార్-బన్నీ కలిసి పుష్ప పార్ట్1తో తగ్గేదే లే అన్నారు. ఆర్య, ఆర్య2 తర్వాత అంతకుమించి అన్న లెవెల్ లో పాన్ ఇండియా వైడ్ మ్యాసివ్ సక్సెస్ ఆస్వాదిస్తున్నారు.

Bangarraju: నాగ్ లెక్కే కరెక్ట్ అయింది.. జాక్ పాట్ కొట్టేశాడుగా!

రామ్-కిషోర్ తిరుమల కాంబోలో వచ్చిన మూడో సినిమా రెడ్. పెద్ద సక్సెస్ కాకపోయినా 2021లో కలెక్షన్స్ రాబట్టింది. గౌతమ్ నందా మూవీ కాంబో.. గోపీచంద్, సంపత్ నంది ల సీటీమార్.. లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ కి బూస్టప్ నిచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వెంకీ-శ్రీకాంత్ అడ్డాల కలసి నారప్పను తీసుకొచ్చారు. నిన్నుకోరి తర్వాత నాని-శివ నిర్వాణ కాంబినేషన్ టక్ జగదీష్ ను రిలీజ్ చేశారు. నారప్ప, టక్ జగదీష్ రెండూ డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చి స్మార్ట్ స్క్రీన్ ఆడియెన్స్ ను ఖుషీ చేశాయి.

Radhe Shyam : చెప్పిన టైమ్‌కే రాధే శ్యామ్..!

చాన్నాళ్లుగా ఫ్లాప్స్ ని ఫేస్ చేస్తోన్న డైరెక్టర్స్ ని 2021 సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. బొమ్మరిల్లు తర్వాత సరైన బొమ్మే లేని భాస్కర్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీఫ్ నిచ్చింది. అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబో ఏకంగా 50కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. పవన్ కల్యాణ్ ను వకీల్ సాబ్ గా మార్చి 135 కోట్లకు పైగా గ్రాస్ సాధించాడు డైరెక్టర్ వేణూశ్రీరామ్. డెబ్యూ సినిమా అని ఫోజులు కొట్టాడు గానీ పిట్టగోడతో ఎప్పుడో ఫ్లాప్ కొట్టాడు డైరెక్టర్ అనుదీప్. ఇక 2021లో జాతిరత్నాలుతో జనాలకి ఫన్ డోస్ ఇచ్చిన అనుదీప్ కామెడీగా ఈ ఇయర్ హల్చల్ చేసాడు.

RRR Postpone: వాయిదా పడిన ఆర్ఆర్ఆర్.. మేకర్స్ అధికారిక ప్రకటన!

ఈ ఏడాది కొత్త దర్శకులు చాలామందే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్లలో సెన్సేషనల్ హిట్ కొట్టింది మాత్రం ఉప్పెన బుచ్చి బాబు మాత్రమే. కోర్ట్ డ్రామా నాందితో విజయ్ కనకమేడల ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన రైటింగ్ స్కిల్స్, టేకింగ్ తో రాజ రాజ చోరను తెరకెక్కించి ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు డైరెక్టర్ హసిత్ గోలీ. పూరీ జగన్నాథ్ శిష్యుడిగా పరిచయమైన అనిల్ పాదూరిపై రొమాంటిక్ ముద్ర పడింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలాతో మున్నా, షాదీ ముబారక్ మూవీతో పద్మశ్రీ, చావు కబురును చల్లగ చెప్పిన కౌశిక్ పెగళ్లపాటి, స్పై థ్రిల్లర్ రాజా విక్రమార్కను చూపించిన శ్రీసారిపల్లి, నిత్యామీనన్ స్కైలాబ్ ను తీసుకొచ్చిన విశ్వక్ కందేరావ్ వంటి వారు కాస్త సందడి చేశారు.

Anchor Manjusha: యాంకర్ మంజూష ఫోటో షూట్.. అదుర్స్ అంతే!

2021లో ముఖ్యంగా ముగ్గురు లేడీ డైరెక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ముగ్గురికి హ్యూజ్ సక్సెస్ దక్కలేదు. శ్రీకాంత్ కొడుకుతో పెళ్లి సందడి చేయించిన దర్శకేంద్రుడి శిష్యురాలు గౌరీ రోనంకి తనదైన మార్క్ చూపించలేకపోయింది. కానీ మోస్తారు కలెక్షన్స్ రాబట్టేలా చేసి.. సినిమాను ఒడ్డున పడేసింది. వరుడు కావలెనుతో ఓన్ స్టైల్ చూపించిన లక్ష్మీ సౌజన్యకు ఎక్స్ పెక్ట్ చేసినంత సక్సెస్ రాలేదు. చివరగా ఈమధ్యే గమనంతో డైరెక్టర్ సుజనా రావ్ థియేటర్స్ కొచ్చింది. ఎంచుకున్న సబ్జెక్ట్ బాగున్నప్పటికీ.. తెరకెక్కించిన విధానం ఆకట్టుకోలేకపోయింది.