Samantha Raj Nidimoru : వామ్మో.. సమంత – రాజ్ నిడిమోరుకు మధ్య ఏజ్ గ్యాప్ ఇంత ఉందా?

నేడు ఈ జంట పెళ్లి చేసుకోగా వీరి గురించి పలు విషయాలు ఆసక్తికరంగా మారాయి. (Samantha Raj Nidimoru)

Samantha Raj Nidimoru : వామ్మో.. సమంత – రాజ్ నిడిమోరుకు మధ్య ఏజ్ గ్యాప్ ఇంత ఉందా?

Samantha Raj Nidimoru

Updated On : December 1, 2025 / 4:30 PM IST

Samantha Raj Nidimoru : నటి సమంత నేడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ ఇది రెండో వివాహమే. సమంత 2017లో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకోగా 2021 లో విడిపోయింది. 2021 ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేస్తున్నప్పటి నుంచి సమంత రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో ఉందని సమాచారం. రాజ్ నిడిమోరు కూడా 2022లో తన మొదటి భార్య శ్యామలీకి విడాకులు ఇచ్చాడు.(Samantha Raj Nidimoru)

నేడు ఈ జంట పెళ్లి చేసుకోగా వీరి గురించి పలు విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చర్చగా మారింది. సమంత 1987 ఏప్రిల్ 28న పుట్టింది. ఆమెకు ప్రస్తుతం 38 ఏళ్ళు. ఇక రాజ్ నిడిమోరు వికీపీడియా సమాచారం ప్రకారం 1975 ఆగస్టు 4న పుట్టారు. ఆయనకు ప్రస్తుతం 50 ఏళ్ళు. దీంతో ఈ ఇద్దరికీ ఆల్మోస్ట్ 12 ఏళ్ళు ఏజ్ డిఫరెన్స్ ఉంది.

Also Read : Samantha Raj Nidimoru : పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ తో సమంత ఫోటోలు చూశారా..? ఎప్పట్నుంచో హింట్ ఇస్తుంది..

ఈ విషయం తెలుసుకొని వామ్మో సమంత – రాజా మధ్య ఏకంగా 12 ఏళ్ళ డిఫరెన్స్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఓ 30, 40 ఏళ్ళ క్రితం ఇంత ఏజ్ గ్యాప్ తో పెళ్లిళ్లు జరిగేవి. ఇటీవల ఆ ఏజ్ గ్యాప్ చాలా తగ్గింది. చాలా వరకు అమ్మాయిలు అబ్బాయిలు తమ ఏజ్ గ్రూప్ వాళ్లనే చూసుకుంటున్నారు. చాలా రేర్ గా ఇలాంటి సెలబ్రిటీలు మాత్రం ప్రేమలో పడి ప్రేమకు వయసుకు సంబంధం లేదు అని చాటి ఇంత ఏజ్ గ్యాప్ తో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)