Find The Actor : ఈ ఫొటోలోని చిన్నిబాబు ఎవరో గుర్తుపట్టారా? స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి.. ఒకప్పుడు హీరోగా.. ఇప్పుడు మాత్రం..
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న చిన్నిబాబు ఎవరో తెలుసా?

Do You Know The Child in this Photo Star Family Hero
Find The Actor : అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరో చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది. ఆ హీరో తన తండ్రిని గుర్తుచేసుకుంటూ తన తండ్రి చిన్నప్పుడు తనని ఎత్తుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న చిన్నిబాబు ఎవరో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న చిన్ని బాబు హీరో సుశాంత్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, నాగార్జున మేనల్లుడు సుశాంత్ అనుమోలు. నిన్న సుశాంత్ తండ్రి సత్యభూషణ రావు పుట్టిన రోజు కావడంతో ఆయన్ను తలుచుకుంటూ ఆయనతో చిన్నప్పుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. సుశాంత్ తండ్రి 2017లో మరణించారు. సుశాంత్ తల్లి నాగ సుశీల నాగార్జునకు స్వయానా సొంత అక్క.
అక్కినేని ఫ్యామిలీ నుంచి సుశాంత్ నటుడిగా 2008లో కాళిదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కరెంట్, అడ్డా, చిలసౌ.. లాంటి పలు సినిమాలతో విజయాలు సాధించినా కొన్ని పరాజయాలు కూడా ఎదురయ్యాయి. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారాడు సుశాంత్. అలవైకుంఠపురంలో, భోళా శంకర్, రావణాసుర.. సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించారు సుశాంత్.
Also Read : Anasuya : నాకు ఎదురైన సంఘటనలు మాత్రమే చెప్పాను.. వాటిని వక్రీకరించొద్దు.. అనసూయ ట్వీట్.. దేనికోసమో?
గత రెండేళ్లుగా ఎలాంటి సినిమా కానీ, సిరీస్ కానీ అనౌన్స్ చేయలేదు. మరి భవిష్యత్తులో సుశాంత్ హీరోగా సినిమాలు, సిరీస్ లు చేస్తాడా? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతాడా చూడాలి.