Rashmika Mandanna : రష్మిక చేతిపై ఉండే టాటూ మీనింగ్ ఏంటో తెలుసా?? టాటూ ఎందుకు వేయించుకుందో చెప్పేసిన రష్మిక..

రష్మిక దీని గురించి మాట్లాడుతూ.. అసలు నేను టాటూ వేయించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకసారి మా కాలేజీలో ఒక అబ్బాయి.............

Rashmika Mandanna : రష్మిక చేతిపై ఉండే టాటూ మీనింగ్ ఏంటో తెలుసా?? టాటూ ఎందుకు వేయించుకుందో చెప్పేసిన రష్మిక..

do you know the meaning of tattoo on rashmika mandanna hand

Updated On : January 16, 2023 / 9:28 AM IST

Rashmika Mandanna :  నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీలో చాలా ఆఫర్స్ తో దూసుకుపోతుంది రష్మిక. ఇటీవలే సంక్రాంతికి విజయ్ సరసన వారసుడు సినిమాతో వచ్చి అలరించింది. త్వరలో బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాతో రాబోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకి మరింత దగ్గరవుతూ ఉంటుంది.

హీరోయిన్స్, హీరోస్, సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. అలాగే రష్మిక చేతిమీద ‘Irreplaceable’ అనే ఒక టాటూ ఉంటుంది. చాలా మంది ఈ టాటూ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక తన చేతి మీద ఉండే టాటూ గురించి చెప్పింది.

RGV : కాకినాడ కోడిపందాల్లో ఆర్జీవీ.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో మకాం..

రష్మిక దీని గురించి మాట్లాడుతూ.. అసలు నేను టాటూ వేయించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకసారి మా కాలేజీలో ఒక అబ్బాయి ఆడపిల్లలు బాధని ఓర్చుకోలేరు, వాళ్లకి సూదులు అన్నా భయమే అని అన్నాడు. దీంతో నాకు కోపం వచ్చి అది తప్పు అని నిరూపించాలి అనుకున్నాను. అప్పుడే టాటూ వేయించుకోవాలి, టాటూ వేసేటప్పుడు వచ్చే బాధ, నొప్పి భరించి చూపించాలి అనుకున్నాను. టాటూ వేయించుకోవాలి అనుకున్నాను కానీ ఏం వేయించుకోవాలి అర్ధం కాలేదు. చాలా సేపు ఆలోచించాను. మన జీవితంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే. ఎవరి ప్రత్యేకత వారిది. ఎవర్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు అని నేను నమ్ముతాను. దీన్నే టాటూ వచ్చేలాగా వేయించుకోవాలి అనుకున్నాను. ఈ మొత్తానికి ఒకే మీనింగ్ వచ్చేలాగా ‘Irreplaceable’ అనే టాటూ వేయించుకోవాలని డిసైడ్ అయి వేయించుకున్నాను అని తెలిపింది. దీంతో రష్మిక టాటూ వెంక ఇంత కథ ఉందా అని అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.