Alia Bhatt : రామ మందిర ప్రారంభోత్సవంలో అలియా కట్టుకున్న చీర స్పెషల్ ఏంటి? దాని ధర ఎంతో తెలుసా?
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో స్టార్ హీరోయిన్ అలియా భట్ ధరించిన మైసూర్ సిల్క్ చీర వైరల్ అవుతోంది. ఈ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

Alia Bhatt
Alia Bhatt : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్-అలియా భట్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలియా భట్ ధరించిన చీర వార్తల్లోకెక్కింది. ఎంతో అందంగా ఉన్న ఈ చీర ప్రత్యేకత ఏంటి? దీని ఖరీదెంత? చదవండి.
Blue Star : పెళ్లి తర్వాత జంటగా వెండితెరపై కనిపించనున్న ఆ స్టార్ కపుల్..
అలియా భట్ అందమైన పట్టుచీర కట్టుకుని భర్త రణ్‌బీర్ కపూర్‌తో రామ మందిర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సిల్క్ చీరను మాధుర్య క్రియేషన్స్ వారు డిజైన్ చేసారట. ఈ చీరను 10 రోజుల్లో డిజైన్ చేసారని తెలుస్తోంది. కర్నాటక మైసూర్ సిల్క్ చీరపై రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలను డిజైన్ చేసారు. రాముడు శివ ధనుస్సును విరవడం, రాముడిని అడవికి వెళ్లమని అడగడం, గంగా నదిపై వంతెన, బంగారు జింక, సీతాపహరణ వంటి చిత్రాలు ఈ చీరపై డిజైన్ చేసారు.
Saif Ali Khan : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్.. ఎన్టీఆర్ అభిమానులు హ్యాపీ ట్వీట్స్..
నాలుగు అంగుళాల పల్లూపై కళాకారులు ఎంతో కష్టపడి రామాయణ ఘట్టాలను డిజైన్ చేసారట. ఈ చీర తయారు చేయించిన యజమాని భారతి హరీష్ మాట్లాడుతూ ‘ఇద్దరు ఆర్టిస్టులు 10 రోజుల పాటు వర్క్ చేసారని .. ఎంతో కష్టపడ్డారని’ చెప్పారు. ఈ చీర ఖరీదు రూ.45,000 అని భారతి వెల్లడించారు. ఇక ఈ చీరలో అలియా ఎంతో అందంగా, హుందాగా కనిపించారు. ప్రస్తుతం అలియా ధరించిన చీర ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram