నేను బతికే ఉన్నాను : చావు వార్తలపై సునీల్ వివరణ

  • Published By: venkaiahnaidu ,Published On : March 15, 2019 / 03:34 PM IST
నేను బతికే ఉన్నాను : చావు వార్తలపై సునీల్ వివరణ

Updated On : March 15, 2019 / 3:34 PM IST

తాను చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని నటుడు సునీల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయి సునీల్ మృతిచెందినట్లు షేస్ బుక్ లలో కొందరు తప్పుడు పోస్ట్ లు పెట్టారు. దీనిపై శుక్రవారం(మార్చి-15,2019) ట్విట్టర్ వేదికగా స్పందించిన సునీల్…సునీల్ కి యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లు ఒక మతిస్థితిమితం లేని వ్యక్తి తమ న్యూస్ వ్యూస్ పెంచుకునేందుకు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని,ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,తాను అందరి ఆశిస్సులతో పూర్తి క్షేమంగా ఉన్నానని, ఇలాంటి తప్పుడు ఆర్టికల్స్ ను ఎవ్వరూ నమ్మదని సునీల్ కోరారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ న్యూస్ ఎక్కువ అవుతున్నాయి.ఫేస్ బుక్ కూడా ఇటువంటి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.