అభిమానులకు పండుగే: ఒకే వేదికపైకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

  • Published By: vamsi ,Published On : August 27, 2019 / 06:02 AM IST
అభిమానులకు పండుగే: ఒకే వేదికపైకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

Updated On : August 27, 2019 / 6:02 AM IST

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్(టీసీపీఈయూ) స్థాపించి 25ఏళ్లు అయిన సందర్భంగా సంస్థ రజతోత్సవ వేడుకలను హైదరాబాద్ లో జరుపుతుంది. గచ్చిబౌలి ఇన్‌డోర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు హాజరు కాబోతున్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌, నిర్మాతలు కె.ఎస్‌ రామరావు, దిల్‌రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు ఇప్పటికే ఈ విషయాన్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.

అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న విషయం ప్రకారం.. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలను గెస్ట్ లుగా ఆహ్వనించగా ప్రోగ్రామ్ కి వచ్చేందుకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అంగీకరించినట్లుగా తెలుస్తుంది.

ఎంతోకాలం నుంచి వీరిద్దరినీ ఒకే వేదికపై చూడాలని అనుకుంటున్న అభిమానుల కల ఈ ప్రోగ్రామ్ తో నెరవేరనున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 8వ తేదీన ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో జరగనుంది. వీళ్లిద్దరు గతంలో మహేష్ బాబు యువరాజు సినిమా ప్రారంభ కార్యక్రమంలో ఒకే వేదికపైకి వచ్చారు.