Dulquer Salmaan : సూపర్ హిట్ ‘సార్’ కాంబినేషన్ మరోసారి.. ఈ సారి దుల్కర్ సల్మాన్ తో..

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇటీవల అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తెలుగులో సీతారామం సినిమాతో భారీ విజయం సాధించారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమాను ప్రకటించారు.

Dulquer Salmaan : సూపర్ హిట్ ‘సార్’ కాంబినేషన్ మరోసారి.. ఈ సారి దుల్కర్ సల్మాన్ తో..

Dulquer Salmaan and Venky Atluri combination movie announced by Sithara Entertainments

Updated On : May 14, 2023 / 9:18 AM IST

Venky Atluri : వెంకీ అట్లూరి దర్శకుడిగా తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) హీరోగా తెరకెక్కిన సినిమా సార్(Sir). తెలుగు, తమిళ్ లో రిలీజయిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ విజయం సాధించి ధనుష్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. సార్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇదే డైరెక్టర్ – ప్రొడ్యూసర్స్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది.

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇటీవల అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తెలుగులో సీతారామం సినిమాతో భారీ విజయం సాధించారు. దుల్కర్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమాను ప్రకటించారు. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దుల్కర్ – వెంకీ అట్లూరి సినిమాను అదే నిర్మాతలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Also Read :    Harish Shankar : అలాంటి వాళ్లనే బ్లాక్ చేస్తాను.. దానికి నేని రెడీనే.. హరీష్ శంకర్ ట్వీట్..

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ లో షూటింగ్ కి వెళ్లనుంది. సమ్మర్ 2024 లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించేశారు చిత్రయూనిట్. ఇటీవల వెంకీ అట్లూరి సార్ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉండటం, సితార ఎంటర్టైన్మెంట్స్, దుల్కర్ కూడా వరుస హిట్స్ తో ఫామ్ లో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సారి ఎలాంటి సినిమాతో మెప్పిస్తాడో వెంకీ అట్లూరి చూడాలి మరి.