Ekta Kapoor : నేను అడల్ట్ సినిమాలే చేస్తాను.. నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన లేడీ నిర్మాత..
బాలీవుడ్ భామలు భూమి పడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిల.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన థ్యాంక్యూ ఫర్ కమింగ్ సినిమా అక్టోబర్ 6న రిలీజయింది. సినిమా రిలిజ్ అయ్యాక ఏక్తా కపూర్ ట్విట్టర్ లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేయగా చాలా మంది విమర్శిస్తూ ప్రశ్నలు అడిగారు.

Ekta Kapoor Counter to Netizens Regarding her Movies
Ekta Kapoor : బాలీవుడ్(Bollywood) స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు ఏక్తా కపూర్. ఒకప్పటి స్టార్ హీరో జితేంద్ర కూతురిగా సినీ పరిశ్రమలోకి నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది ఏక్తా కపూర్. టెలివిజన్ రంగంలో సీరియల్స్, షోస్ తో బాలీవుడ్ బుల్లితెరపై తిరుగులేని నిర్మాతగా ఎదిగింది. నిర్మాతగా ఎన్నో సినిమాలని, సిరీస్ లను తెరకెక్కించి సూపర్ హిట్స్ కొట్టింది. ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ యాప్ తో కూడా సంచలనం సృష్టించింది ఏక్తా కపూర్.
అయితే ఏక్తా కపూర్ ఎక్కువగా బోల్డ్, అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు చేసింది. ఇక తన ఓటీటీ ఆల్ట్ బాలాజీలో అయితే చాలా వరకు బోల్డ్, అడల్ట్ కంటెంట్ సిరీస్ లు ఉంటాయి. దీంతో గతంలో ఏక్తా కపూర్ పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఏక్తా అవేమి పట్టించుకోకుండా తన పంథాన తను సినిమాలు, సిరీస్ లు తీసుకుంటూ వెళ్తుంది. ఇటీవల థ్యాంక్యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ కామెడీ సినిమాతో వచ్చింది.
బాలీవుడ్ భామలు భూమి పడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిల.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన థ్యాంక్యూ ఫర్ కమింగ్ సినిమా అక్టోబర్ 6న రిలీజయింది. సినిమా రిలిజ్ అయ్యాక ఏక్తా కపూర్ ట్విట్టర్ లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేయగా చాలా మంది విమర్శిస్తూ ప్రశ్నలు అడిగారు. వాటికి ఏక్తా కపూర్ తన శైలిలో సమాధానాలిచ్చింది.
Also Read : Tiger Nageswara Rao : మరీ అంత ఎక్కువా? చర్చగా మారిన రవితేజ టైగర్ నాగేశ్వర రావు రన్ టైం..
నీ వల్ల ఎంతోమంది యూత్ చెడిపోతున్నారు, మంచి సినిమాలు తీయొచ్చుగా, నువ్వు, కరణ్ జోహార్ కలిసి బాలీవుడ్ ని చెడగొడుతున్నారు, ఎంతోమంది విడాకులకు మీరే కారణం.. అని నెటిజన్స్ పలు కామెంట్స్ చేయగా వాటికి సమాధానాలు ఇవ్వకుండా అవునా, ఓకే అంటూ వదిలేసింది. ఓ నెటిజన్ అయితే మీరు ఇలా అడల్ట్ సినిమాలు తీయడం ఆపండి అని చెప్పడంతో దానికి ఏక్తా కపూర్ రిప్లై ఇస్తూ.. నో.. నేనొక అడల్ట్ ని కాబట్టి నేను అడల్ట్ సినిమాలే తీస్తాను అని చెప్పింది. దీంతో ఏక్తా ఇచ్చిన సమాధానాలు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
No I’m an adult so I will make adult movies? https://t.co/orTGS9Nxmy
— Ektaa R Kapoor (@EktaaRKapoor) October 9, 2023
Hmmmmmm!!! https://t.co/WGH7KdcqNd
— Ektaa R Kapoor (@EktaaRKapoor) October 9, 2023
Hmmmmmmm hmmmmmm https://t.co/ibxLc3e6ZD
— Ektaa R Kapoor (@EktaaRKapoor) October 9, 2023