ET 20 : యానిమల్‌ వైల్డ్ ట్రైలర్.. గుంటూరు కారం ధీమా.. మెగాస్టార్‌ ఇజ్జత్‌..

సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్’ నుంచి వైల్డ్ ట్రైలర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి..

ET 20 : యానిమల్‌ వైల్డ్ ట్రైలర్.. గుంటూరు కారం ధీమా.. మెగాస్టార్‌ ఇజ్జత్‌..

ET 20: Latest Entertainment News Today on 23 November

‘యానిమల్‌’ వైల్డ్ ట్రైలర్..
రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యానిమల్‌’. ఈ సినిమాకు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

డెంగీతో బాధపడుతున్న భూమి..
ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్‌ ఆస్పత్రిలో చేరారు. గత ఎనిమిది రోజులుగా.. నరకం అనుభవిస్తున్నానంటూ ఆస్పత్రిలో బెడ్‌పై ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అభిమానులారా జాగ్రత్తగా ఉండండి.. గత కొన్ని రోజులుగా డెంగీతో బాధపడుతున్న అని తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Bhumi Pednekar (@bhumipednekar)

నాగచైతన్య ‘దూత’ ట్రైలర్..
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకొస్తారు హీరో నాగచైతన్య. ఇప్పుడు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమయ్యరు. నాగచైతన్య నటించిన లేటెస్ట్ వెబ్‌ సిరీస్‌ ‘దూత’. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా డిసెంబర్‌ 1 నుంచి స్ట్రీమింగా కానుంది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా దూత ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉందని చైతన్య అభిమానులు అంటున్నారు.

శ్రద్ధా దాస్ ‘పారిజాత పర్వం’..
చైతన్య రావు హీరోగా సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. శ్రద్ధా దాస్, సునీల్‌ కీలక పాత్రల్లో నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

‘కెప్టెన్‌ మిల్లర్‌’ కిల్లర్‌ కిల్లర్‌..
ధనుష్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌ జంటగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘కిల్లర్‌ కిల్లర్‌’.. లిరికల్‌ సాంగ్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

‘భగవంత్ కేసరి’ ఓటీటీ రిలీజ్..
బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ‘భగవంత్ కేసరి’. థియేటర్స్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. రేపు నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది.

నందమూరి ‘బ్రీత్’..
నందమూరి చైతన్యకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘బ్రీత్’. బసవతారక రామ క్రియేషన్స్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్‌ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ నెల 25న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనుంది. హైదరాబాద్‌ దస్పల్లా హోటల్‌లో ఈ వేడుక జరగనుంది.

‘కన్నప్ప’ ఫస్ట్ లుక్..
నటుడు మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా.. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్‌లో చూపించారు.

‘తండేల్’గా నాగచైతన్య..
నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన నటిస్తున్న చిత్రం నుంచి లుక్ విడుదలైంది. ‘తండేల్’ అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. బోట్ నడిపేవారిని తండేల్ అని అంటారట.

‘జోరుగా హుషారుగా’ రిలీజ్ డేట్ అనౌన్స్..
‘మనసాయనమా’, ‘బేబి’ చిత్రాల‌తో న‌టుడిగా అంద‌రి ప్రశంస‌లు అందుకున్న యూత్‌ఫుల్ క‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. యూత్‌ఫుల్, ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌రు 15న విడుద‌ల చేస్తున్నట్లు ప్రక‌టించారు.

కపిల్ దేవ్‌ డబ్బింగ్ పూర్తి..
విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సలామ్‌’. ఈ సినిమాలో సూపర్ స్టార్‌ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు.. మాజీ క్రికెటర్‌ కపిల్ దేవ్‌ కూడా ఓ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ కూడా పూర్తి చేసుకున్నారు. ఆయన డబ్బింగ్ చెపుతున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.

‘చావెర్’ ఓటీటీ స్ట్రీమింగ్..
థ్రిల్లర్ అంశంతో మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘చావెర్’. కావ్య ఫిల్మ్ కంపెనీ, అరుణ్ నారాయణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ నారాయణ్, వేణు కున్నపిల్లి నిర్మించారు. టిను పప్పచన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. రేపటి నుంచి సోని లైవ్‌లో ఈ మువీ స్ట్రీమింగ్ కానుంది.

గుంటూరు కారం ధీమా..
గుంటూరు కారం సినిమాపై.. ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా విడుదల తర్వాత..రివ్యూలు ఎలా రాసినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఎందుకుంటే అది బ్లాక్‌బస్టర్‌ మూవీ అని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. జనవరి 12న విడుదల కానుంది.

మెగాస్టార్‌ ఇజ్జత్‌..
“బబుల్‌గమ్‌” మూవీలోని ఇజ్జత్‌ సాంగ్‌ ఇవాళ విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవి సాంగ్‌ను లాంఛ్‌ చేశారు. యాంకర్‌ సుమ తనయుడు రోషన్‌ కనకాల ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నారు. రోషన్‌కు జతగా మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే నెల 29న ‘బబుల్‌ గమ్‌’ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే మూవీ యూనిట్‌ సినీ ప్రమోషన్స్‌కు ప్రారంభించింది.

క్షమాపణలు చెప్పేదేలే..
త్రిష-మన్సూర్‌ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తానెవరికీ క్షమాపణలు చెప్పేది లేదన్న నటుడు మన్సూర్‌ అలీఖాన్‌పై జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, నటి ఖుష్బూ ఫైర్‌ అయ్యారు. ఎదుటి వాళ్లను వేలెత్తి చూపించే ముందు మిమ్మల్ని మీరు చూసుకోవాలంటూ మన్సూర్‌కు ట్విట్టర్‌ వేదికగా చురకలు అంటించారు.

ఓపెన్‌హైమర్‌ ఓటీటీ రిలీజ్..
హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ఓపెన్‌హైమర్‌ ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది. అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అణుబాంబును కనుగొన్న శాస్ర్తవేత్త రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం అందుకుంది. క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు.

సిద్ధు కొత్త మూవీ అప్డేట్..
సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్‌ కలయికలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ డిసెంబర్‌ తొలి వారంలో మొదలు కానుంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య నటిస్తోంది. ‘బేబీ’తో విజయాన్ని అందుకున్న కథానాయిక వైష్ణవి.

‘ఆదికేశవ’ ప్రీమియర్‌ షోలు..
వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా రూపొందిన చిత్రం ‘ఆదికేశవ’. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెంటిమెంట్‌గా తిరుపతిలోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేయనున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. అభిమానుల కోసం మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రీమియర్‌ షో వేస్తామని వెల్లడించారు.

‘బార్బీ’ వసూళ్ల సునామీ..
హాలీవుడ్ సినిమా ‘బార్బీ’ వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 8వేలకు పైగా కోట్లు వసూలు చేసింది. మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్‌, విల్‌ ఫెర్రల్‌ తదితర హాలీవుడ్ స్టార్స్‌ ఇఁదులో నటించారు. ఈ సినిమా జులై 21న విడుదలైంది.

‘డెవిల్’ సెకండ్ సాంగ్..
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సంయుక్తా మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘డెవిల్’. తాజాగా ఈ మూవీ నుంచి “దిస్ ఈజ్ లేడీ రోజ్’ అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ప్రోమోను నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, ఒక సాంగ్‌ను రిలీజ్ చేశారు.