అప్పుడే వంద కోట్లా? అంతేగా.. అంతేగా!

రీసెంట్‌గా ఎఫ్2 రూ.100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయ్యింది.

  • Published By: sekhar ,Published On : January 25, 2019 / 06:00 AM IST
అప్పుడే వంద కోట్లా? అంతేగా.. అంతేగా!

Updated On : January 25, 2019 / 6:00 AM IST

రీసెంట్‌గా ఎఫ్2 రూ.100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయ్యింది.

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఎఫ్2, సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ, యూత్, మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎఫ్2 థియేటర్ల బాట పడుతున్నారు. అన్ని ఏరియాల్లోనూ హౌస్‌ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న ఎఫ్2, యూఎస్‌లోనూ భారీ వసూళ్ళు రాబడుతుంది. రీసెంట్‌గా ఎఫ్2 రూ.100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్2, వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. సంక్రాంతి విన్నర్‌గా నిలవడం, అందులోనూ 2019 వ సంవత్సరంలో, రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి సినిమాగా ఎఫ్2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి నైజాం లాంటి ఏరియాలో 3వ వారం నుండి థియేటర్స్ కూడా పెరిగాయి. ప్రస్తుతం దీనికి ధీటుగా పోటీ ఇచ్చే సినిమా మరొకటి లేకపోవడంతో, మరికొద్ది రోజులపాటు ఎఫ్2 బాక్సాఫీస్ బరిలో భారీ కలెక్షన్లు సాధించడం పక్కా అని చెప్పొచ్చు.

వాచ్ గిర్రా గిర్రా సాంగ్ ప్రోమో…