Skanda : రామ్ పై అభిమానంతో తన బిడ్డకు.. ‘స్కంద’ అనే పేరు పెట్టిన అభిమాని..

రామ్ పోతినేని పై అభిమానంతో తన బిడ్డకు 'స్కంద' అనే పేరుని పెట్టాడు ఒక అభిమాని. ఈ విషయంపై..

Skanda : రామ్ పై అభిమానంతో తన బిడ్డకు.. ‘స్కంద’ అనే పేరు పెట్టిన అభిమాని..

Fan Ram Pothineni is putting Skanda name for his baby boy

Updated On : September 17, 2023 / 8:12 PM IST

Skanda : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ‘స్కంద’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే, రామ్ పై అభిమానంతో ఒక అభిమాని చేసిన పని.. ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. రామ్ అభిమాని అయిన హరిహర.. రీసెంట్ గా తన కొడుకు నామకరణ వేడుక నిర్వహించాడు.

Jawan Collections : జవాన్ 10 రోజుల కలెక్షన్స్.. షారుఖ్ మరో 1000 కోట్ల సినిమా..

ఇక రామ్ కి తాను వీరాభిమాని కావడంతో తన బిడ్డకి.. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ‘స్కంద’ మూవీ టైటిల్ ని పేరుగా పెట్టాడు. ఈ విషయాన్ని ఒక అభిమాని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది రామ్ వరకు చేరింది. దీంతో రామ్ కూడా దీని పై రియాక్ట్ అయ్యాడు. “నా గుండెలకు హత్తుకుంది. ఆ దేవుడు స్కంద బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఆ బాబు పై ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Mounika Reddy : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హీరోయిన్‌గా మోనిక రెడ్డి ఎంట్రీ..

స్కంద విషయానికి వస్తే.. ఈ వారమే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెప్టెంబర్ 28 కి పోస్ట్‌పోన్ అయ్యింది. ఆ డేట్ లో రావాల్సిన సలార్ వాయిదా పడడం, ఆ తేదీకి ఎక్కువ రోజుల వీకెండ్ కలిసి రావడంతో మూవీ టీం అప్పటికి షిఫ్ట్ అయ్యారు. ఈ సినిమాలో రామ్ ఊరమస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ లో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఇక రేపు వినాయక చవితి సందర్భంగా.. మూవీలోని స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, రామ్ కాంబినేషన్ లో ఉండబోతున్న ‘కల్ట్ మామ’ అనే సాంగ్ ని రేపు ఉదయం 11:34 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.