Sreemukhi : అభిమాని లేఖకు ఉబ్బితబ్బిబైన యాంకరమ్మ
యాంకర్ శ్రీముఖికి తన అభిమాని నాలుగు పేజీల అచ్చ తెలుగు లేఖను రాశాడు.. ఆ లేఖను చూసి యాంకరమ్మ ఉబ్బితబ్బిబై పోతోంది.

Sreemukhi
Sreemukhi : దేశంలో రాజకీయ నాయకులకు, నటినటులకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తమ అభిమానం చాటుకునేందుకు కొన్ని సార్లు ఫ్యాన్స్ చేసే పనులు అందరిని కట్టిపడేస్తాయి. ఇక అభిమాన హీరో పుట్టినరోజు నాడు కేకులు కట్ చేయడం, రక్తదానం, అన్నదానం వంటివి చేస్తుంటారు. కొందరైతే కాలినడకన వెళ్లి తమ అభిమాన హీరోలను కలుస్తుంటారు. తాజాగా ఇటువంటివి చాలానే జరిగాయి. అభిమానం చాటుకోవడంతో ఒక్కొక్కరు ఒక్కో పంధా అవలంభిస్తారు.
Read More : Pawan Kalyan: రూ. 500 ఇస్తే మన ఏపీలో ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారు!
ఇక తాజాగా శ్రీముఖి అభిమాని, ఆమెను పొగుడుతూ లేఖ రాశాడు. ఈ లేఖ అచ్చ తెలుగులో నాలుగు పేజీలు ఉంది. దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. లేఖలో ఆమె టాలెంట్‌ని ఆకాశానికి ఎత్తడంతో పాటు కెరీర్‌లోని మలుపులు, ముఖ్య ఘట్టాల గురించి చెప్పుకొచ్చాడు. సదరు అభిమాని పేరు వెంకట్ అని తెలుస్తుండగా, అంతకు మించిన వివరాలు ఏవీ లేవు. సోషల్ మీడియా యుగంలో అచ్చతెలుగులో నాలుగు పేజీల లేఖ రాయడం తనకు ఎంతో ఆనందాన్ని అందించిందని పేర్కొంది శ్రీముఖి. మీరెవరో తెలియదు కాని, మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొంది.
Read More : Pawan Kalyan: డబ్బు పెరిగే కొద్దీ భయం పుడుతుంది.. అందుకే డబ్బు వెనుక పరుగెత్తలేదు!
ఇక యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టిన శ్రీముఖి.. పటాస్ ప్రోగ్రామ్ తో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ 3లో పాల్గొని రన్నర్ గా నిలిచింది. ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తుండటంతో శ్రీముఖి సినిమాలపై దృష్టిపెట్టింది. తాజాగా క్రేజీ అంకుల్స్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా శ్రీ ముఖికి మంచి పేరు తెచ్చుపెట్టింది.