Mohan Babu-Lakshmi Manchu: తండ్రీ-కుమార్తె ప్రధాన పాత్రల్లో మూవీ ప్రారంభం!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో సన్నాఫ్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల ఫిబ్రవరి 18న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Mohan Babu-Lakshmi Manchu: తండ్రీ-కుమార్తె ప్రధాన పాత్రల్లో మూవీ ప్రారంభం!

Mohan Babu Lakshmi Manchu

Updated On : February 12, 2022 / 4:47 PM IST

Mohan Babu-Lakshmi Manchu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో సన్నాఫ్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల ఫిబ్రవరి 18న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన సన్నాఫ్ ఇండియా ట్రైలర్ అటెన్షన్ క్రియేట్ చేయగా.. మోహన్ బాబు ఇప్పుడు మరో సినిమా కూడా మొదలు పెట్టారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను శనివారం లాంఛనంగా ప్రారంభించారు.

Deepika Padukone: మై లైఫ్.. మై రూల్స్.. నా భర్త పర్మిషన్ కావాలనడమే ఛండాలం!

ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహించబోతుండగా.. సన్నాఫ్ ఇండియా సినిమాకి దర్శకత్వం వహించిన డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి కూడా స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాకి సాయిప్రకాష్ సినిమాటోగ్రఫీ కాగా.. ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ఆయన కుమార్తె లక్ష్మీ ప్రసన్న కలిసి నటించబోతున్నారు. మోహన్ బాబు ఇప్పటి వరకు కుమారులతో కలిసి నటించగా లక్ష్మీతో కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైం కావడం విశేషం.

Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

మహిళా దర్శకురాలు నందినిరెడ్డి ముహూర్తం సన్నివేశంలో ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్ర్కిఫ్ట్ అందజేశారు. మళయాళం నటుడు సిద్దిక్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు ప్రతీక్ మాట్లాడుతూ.. ఇది ఒక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ అని.. మోహన్ బాబు, లక్ష్మి మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో కనిపించనున్నారని చెప్పాడు. మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాని.. సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నట్లు చెప్పారు.