Five Heroines : ఒక సినిమా, ఐదుగురు హీరోయిన్లు.. భయపెట్టేందుకు వచ్చేస్తున్నారు..

సినిమాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు ఉండటం కామన్. కానీ ఐదుగురు హీరోయిన్లతో సినిమా రూపొందడం అరుదనే చెప్పాలి. అలాంటి మూవీ ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు.

Five Heroines : ఒక సినిమా, ఐదుగురు హీరోయిన్లు.. భయపెట్టేందుకు వచ్చేస్తున్నారు..

Five Heroines

Updated On : May 1, 2021 / 12:14 PM IST

Five Heroines : సినిమాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు ఉండటం కామన్. కానీ ఐదుగురు హీరోయిన్లతో సినిమా రూపొందడం అరుదనే చెప్పాలి. అలాంటి మూవీ ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు.

కాజల్‌ అగర్వాల్‌, రెజీనా, రైజా విల్సన్‌, జననీ అయ్యర్‌తో పాటు ఇరాన్‌ నటి నోయారికా కథానాయికలుగా తమిళంలో ఓ హారర్‌ సినిమా తెరకెక్కుతోంది. డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. జుగల్‌బందీ స్టెల్‌లో మహిళా ప్రధాన కథాంశంతో సాగే హారర్‌ సినిమా ఇదని, ఐదుగురు కథానాయికల పాత్రలకు సమప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు డీకే తెలిపారు.

అతీంద్రియ శక్తులు ఉండి వాటిని వినియోగించుకోలేని యువతిగా కాజల్‌ కనిపించగా.. ఆమెను అనుక్షణం వ్యతిరేకించే యువతిగా రెజీనా కనిపిస్తుందని దర్శకుడు చెప్పారు. జననీ, రైజా, నోయారికా పాత్రలు ప్రయోగాత్మక పంథాలో ఉంటాయని వెల్లడించారు. ఇందులో మంచివారు ఎవరు? దెయ్యం ఎవరు? అన్నది ఉత్కంఠను కలిగిస్తుందన్నారు. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. త్వరలోనే టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నారు.