కత్రినా… హ్యాపీ బర్త్‌డే.. నా ఐడియాను కొట్టేశావ్‌గా..!

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ 37వ వసంతంలోకి అడుగుపెట్టింది. కత్రినా పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ తారలంతా ప్రత్యేకించి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సినీ పరిశమ్రలో తన స్నేహితులతో పాటు శ్రేయాభిలాషులు, కో యాక్టర్లు అందరూ కత్రినాకు విషెస్ తెలియజేశారు.
మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునె కూడా ప్రత్యేకంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పింది. ‘హ్యాపీ బర్త్ డే, కత్రినా కైఫ్.. ప్రశాంతమైన మనస్సుతో పాటు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నా’ అంటూ కత్రినా కైఫ్ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసింది.
ఇన్ స్టాగ్రామ్ ట్రెండింగ్ లలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎప్పటికప్పుడూ సరికొత్త పోస్టులతో తమ ఫాలోవర్లను అలరిస్తుంటారు. ఈ ఫొటోతో పాటు దీపికా మరో వీడియోను కూడా షేర్ చేసింది. లాక్ డౌన్ సమయంలో తీసిన కత్రినా వీడియోను దీపికా తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.
ఆ వీడియోలో కత్రినా కిచెన్ రూంలో గిన్నెలను శుభ్రంగా కడుగుతోంది. కత్రినా తన ఐడియాను కొట్టేసిందని అందుకే తన స్పెషల్ సిరీస్ క్యాన్సిల్ అయిందని చమత్కరిస్తూ ఫొటోను షేర్ చేసింది దీపికా పదుకునె.. ఇప్పుడీ ఈ కత్రినా కైఫ్ ఫొటో, వీడియో ఇన్ స్టాలో వైరల్ అవుతోంది.