కరోనా సినిమాలట.. ఫన్నీ టైటిల్స్ చూశారా!..

Corona Movies: ప్రపంచంలో ఏమూల చీమ చిటుక్కుమన్న క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది. లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టు ఏ విషయాన్నైనా ట్రోల్ లేదా వైరల్ చేయడంలో సామాజిక మాధ్యమాలదే ప్రధాన పాత్ర.. గతకొద్ది కాలంగా కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో ఎన్ని జోక్స్, మీమ్స్ వస్తున్నాయో తెలిసిందే.
తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో కనుక సినిమాలు తీస్తే ఏం టైటిల్స్ పెడితే బాగుంటుంది అంటూ కొన్ని పేర్లు వినబడుతున్నాయి. అవేంటో చూద్దాం..
‘‘మాస్కు వీరుడు- శానిటైజర్ సుందరి’’..
‘‘అంబులెన్స్‌లో అబ్బాయి- క్వారంటైన్‌లో అమ్మాయి’’..
‘‘పేషెంట్ నెంబర్ 150’’..
‘‘రెడ్ జోన్ రౌడీ’’..
‘‘కంటోన్మెంట్ కుర్రోడు’’..
‘‘నువ్వేమో కరీనా- నాకేమో కరోనా’’..
‘‘లవ్ ఇన్ లాక్‌డౌన్’’..
‘‘కరోనా కింగ్’’..
‘‘ప్రేమకు సోషల్ డిస్టెన్స్ లేదు’’..
వినడానికి చదవడానికి డబ్బింగ్ సినిమా పేర్లలా ఉన్న ఈ ఫన్నీ టైటిల్స్ సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతున్నాయి..