Krishna Chaitanya : అంత మంచి మర్యాదలతో మా గోదారోళ్ళు లేరు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

గోదారోళ్ళు, గోదావరి జిల్లాల విషయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ కృష్ణ చైతన్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Krishna Chaitanya : అంత మంచి మర్యాదలతో మా గోదారోళ్ళు లేరు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Gangs of Godavari Director Krishna Chaitanya Sensational Comments on Godavari Districts and Godavari People

Updated On : April 28, 2024 / 10:42 AM IST

Krishna Chaitanya : విశ్వక్‌ సేన్(Vishwak Sen), నేహశెట్టి (Neha Shetty) జంటగా, అంజలి (Anjali) ముఖ్య పాత్రలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా మే 17న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ లాంచ్ ఈవెంట్లో మీడియాతో కూడా ముచ్చటించారు మూవీ యూనిట్. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలో దర్శకుడు కృష్ణ చైతన్య గోదావరి జిల్లాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా సినిమాల్లో, బయట గోదావరి జిల్లాలు అంటే ముందు గుర్తొచ్చేది అక్కడి కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, గోదావరి నది, గోదారొళ్ల మంచి, మర్యాదలు. గోదారొళ్ల గురించి ఎవరు చెప్పినా వాళ్ళ మర్యాదల గురించి బాగా చెప్తారు. ఇప్పుడు ఈ విషయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ కృష్ణ చైతన్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Sharrath Marar : ఆ విషయంలో నాకు, త్రివిక్రమ్ కి పవన్ క్లాస్ పీకారు..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ లాంచ్ ఈవెంట్లో కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. నాది కూడా గోదావరి జిల్లానే. మాది ఏలూరు. చిన్నప్పట్నుంచి నాకు బోర్ గా అనిపించేది. సినిమాల్లో గోదావరి జిల్లాలు అంటే కొబ్బరి చెట్లు చూపించి, గ్రీన్ గా చూపించి.. మేము అలా లేము. అంత మంచి మర్యాదలతో మా గోదావరి జిల్లాలోళ్లు లేరు. మా లోపల చాలా ఉంటుంది. చాలా మంది ఉన్నారు. చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు. ఎక్కడో మమ్మల్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు అని ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తీశాను అని తెలిపాడు.

అయితే ఇన్నాళ్లు గోదారోళ్ళు అంటేనే మంచోళ్ళు, మర్యాదలు అని, గోదావరి జిల్లాలు అంటేనే ప్రకృతి అని అందరూ ఫీల్ అవుతుంటే ఇప్పుడు కృష్ణ చైతన్య మాలో అంత మంచి మర్యాదలు లేవు, ఈ ప్రకృతి చూపించడం బోర్ కొట్టింది అని వ్యాఖ్యానించడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇప్పటికే పలువురు గోదావరి నెటిజన్లు సోషల్ మీడియాలో కృష్ణ చైతన్య పై విమర్శలు చేస్తున్నారు.