Magadheera: మగధీర రీ-రిలీజ్‌పై గీతా ఆర్ట్స్ క్లారిటీ.. ఏమిటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘మగధీర’ మూవీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. పూర్వజన్మ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాను రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.

Magadheera: మగధీర రీ-రిలీజ్‌పై గీతా ఆర్ట్స్ క్లారిటీ.. ఏమిటో తెలుసా?

Geetha Arts Clarity On Magadheera Re-Release

Updated On : March 18, 2023 / 5:55 PM IST

Magadheera: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘మగధీర’ మూవీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. పూర్వజన్మ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాను రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.

Magadheera: భారీ స్థాయిలో రీ-రిలీజ్‌కు రెడీ అయిన మగధీర!

ఈ సినిమాకు అప్పట్లోనే కళ్లుచెదిరే వసూళ్లు రావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కానీ, ఈ సినిమాను చరణ్ బర్త్‌డే ట్రీట్‌గా రీ-రిలీజ్ చేయడం లేదంటూ గీతా ఆర్ట్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Magadheera Re Release : చరణ్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అల్లు అరవింద్.. మగధీర రీ రిలీజ్?

మగధీర సినిమాను కొన్ని టెక్నికల్ కారణాల వల్ల చరణ్ బర్త్‌డే కానుకగా రీ-రిలీజ్ చేయలేకపోతున్నామని.. మరోసారి ఈ సినిమాను సరైన సమయంలో రీ-రిలీజ్ చేస్తామని గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తమ అభిమాన హీరో ఇండస్ట్రీ హిట్ సినిమాను బర్త్ డే కానుకగా థియేటర్లలో చూడాలని ఆశపడిన అభిమానులకు ఇది నిజంగా చేదు వార్తే అని చెప్పాలి. అయితే, చరణ్ కెరీర్‌లో మంచి రొమాంటిక్ మూవీగా నిలిచిన ఆరెంజ్ సినిమాను రీ-రిలీజ్ చేస్తుండటంతో ఆ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.