GHMC – Wall Posters : సినిమా వాళ్లకు షాక్ ఇచ్చిన GHMC.. ఇకపై అవి ప్రింట్ చేయడానికి వీల్లేదు..
తాజాగా వాల్ పోస్టర్స్, బ్యానర్స్, కటౌట్స్ కి సంబంధించి ఓ నోటిస్ విడుదల చేసింది GHMC.

GHMC Banned Wall Posters Unauthorized Banners Cutouts Notice Issued
GHMC – Wall Posters : అసలు సినిమా ప్రమోషన్ మొదలుపెట్టేదే వాల్ పోస్టర్స్ నుంచి. గోడలపై సినిమా వాల్ పోస్టర్స్ అతికించే సంస్కృతి ఎన్నో ఏళ్లుగా ఉంది. హైదరాబాద్ లోనే కాదు, ఊళ్ళల్లో కూడా ఇప్పటికే గోడలపై కొత్త సినిమా పోస్టర్స్ అతికిస్తారు. చాలా మంది గతంలో ఆ పోస్టర్, పోస్టర్స్ పై ఉన్న రిలీజ్ డేట్ చూసే సినిమాకు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ఈ విషయంలో సినిమా వాళ్లకు షాక్ ఇచ్చింది.
ఇటీవల వాల్ పోస్టర్స్, బ్యానర్స్, కటౌట్స్ కి సంబంధించి ఓ నోటిస్ విడుదల చేసింది GHMC. ఈ నోటిస్ ప్రకారం.. మన సిటీ అందంగా, శుభ్రంగా ఉండటానికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. పబ్లిక్ ప్లేసెస్ లో గోడలపై అతికించే వాల్ పోస్టర్స్, పర్మిషన్స్ లేని వాల్ పెయింటింగ్స్ పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్టు ఈ నోటీసులో తెలిపారు. అలాగే త్వరలో డిప్యూటీ కమిషనర్లు లోకల్ ప్రింటర్స్ తో మాట్లాడి పర్మిషన్స్ లేకుండా వీటికి సంబంధించిన ఎలాంటి ప్రింట్స్ చేయకూడదు అని ఆదేశాలు జారీ చేయాలి. ఒకవేళ పర్మిషన్ లేకుండా పోస్టర్స్ ప్రింట్ చేస్తే స్ట్రిక్ట్ నోటీసులు ఇవ్వాలి వాళ్లకు. అలాగే సినిమా థియేటర్స్ వాళ్ళతో మాట్లాడి వాల్ పోస్టర్స్ ఎక్కడపడితే అక్కడ గోడలకు అంటించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డిప్యూటీ కమిషనర్లు అంతా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండి వాల్ పోస్టర్స్, పెయింటింగ్స్, పర్మిషన్ లేని కటౌట్స్, బ్యానర్లు లేకుండా చూడాలి, ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే ఫైన్స్ విధించాలి అని తెలిపారు.
దీంతో వాల్ పోస్టర్స్ ఇకపై హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ కనిపించవా అని అనుకుంటున్నారు సినిమా ఫ్యాన్స్. అలాగే ఫ్యాన్స్ కూడా ఆత్మ హీరోల బ్యానర్లు, కటౌట్స్ హైదరాబాద్ లో ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు అని ఈ నోటీసుతో తెలుస్తుంది. ఒక సినిమా ప్రమోషన్స్ లో ముందుగా చేసేదే వాల్ పోస్టర్స్ అలాంటి వాటిపై నిషేధం విధిస్తే మరి దీనిపై సినిమా పరిశ్రమ స్పందిస్తుందా చూడాలి.