Maro Prasthanam : తనీష్ “మరో ప్రస్థానం” ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది.

Maro Prasthanam : తనీష్ “మరో ప్రస్థానం” ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్

Maro Prasthanam

Updated On : September 17, 2021 / 9:15 AM IST

Maro Prasthanam : తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మరో ప్రస్థానం’ మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Read More : Uttarandhra : శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి పవిత్రోత్సవాలు

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… బేస్డ్ ఆన్ టు అవర్స్ సిట్టిగ్ ఆపరేషన్ అనే టైటిల్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. అనాధ అయిన నాకు జీవితం ఎప్పుడూ యుద్ధంలాగే అనిపించింది. ప్రపంచం ఒక యుద్ధభూమిలా కనిపించేది. మేఘీని నేను మొదటిసారి చూసినప్పుడు నా జీవితంలో లేనిది ఏంటో అర్ధం అయిన క్షణం.. అని తనీష్ చెప్పిన డైలాగ్స్ తో ఈ కథలో డెప్త్ ఉందనే విషయం అర్థం అవుతుంది. అలాగే మంచి కథతో రూపొందిన సినిమా ఇది అనే ఫీలంగ్ కలిగించింది. అలాగే యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఏదో కావాలని పెట్టినట్టు.. ఆర్టిస్టులు యాక్షన్ సీన్స్ చేస్తున్నట్టుగా అనిపించలేదు.

Read More : Nene Naa Movie : రెజీనా అదరగొట్టేసిందిగా..

ఎక్కడో జరుగుతున్న సంఘటనలను సీక్రెట్ గా షూట్ చేశారా అనిపిస్తుంది. అంతలా నేచురల్ గా చిత్రీకరించడం విశేషం. ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు.. ఒకడు చనిపోయిన వాడు ఇంకొకడు ఇంకా పుట్టనివాడు.. ఈ డైలాగు ఆలోచింపచేస్తుంది. హీరో తనీష్, హీరోయిన్ ముస్కాన్ సేదీ, విలన్ కబీర్ దుహాన్ సింగ్.. పాత్రలకు తగ్గట్టుగా చాలా నేచేరల్ గా నటించడం.. డైరెక్టర్ జాని టేకింగ్ డిఫరెంట్ గా ఉండడంతో ఈ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పచ్చు. ఈ నెల 24న మరో ప్రస్థానం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి.. మరో ప్రస్థానం టీమ్ అందరికీ మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.