Adipurush: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఆదిపురుష్ ‘జై శ్రీరామ్’ లిరికల్ మోషన్ పోస్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ నుండి లిరికల్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

Adipurush: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఆదిపురుష్ ‘జై శ్రీరామ్’ లిరికల్ మోషన్ పోస్టర్

Goosebumps For Adipurush Jai Shri Ram Lyrical Motion Poster

Updated On : April 22, 2023 / 9:20 AM IST

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ హిస్టారికల్ మూవీ కోసం యావత్ ఇండియన్ మూవీ లవర్స్ ఆతృతగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ ‘ఆదిపురుష్’ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. రామాయణం ఆధారంగా ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Adipurush : రిలీజ్‌కి ముందే ఆదిపురుష్ సినిమా ప్రదర్శన.. గ్లోబల్ స్టేజ్ పై ప్రభాస్ సినిమాకి గౌరవం!

అయితే, ఈ చిత్ర టీజర్ మాత్రం ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్‌ను మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్ పనులు చాలా దారుణంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు చిత్ర యూనిట్ పై మండిపడ్డారు. దీంతో ఈ వీఎఫ్ఎక్స్ పనులను మరింత మెరుగ్గా చేసేందుకు చిత్ర యూనిట్ మరింత సమయాన్ని తీసుకుంది. వీఎఫ్ఎక్స్ పనులపై రీవర్క్ చేసి, ఇప్పుడు మరింత క్వాలిటీతో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ నుండి ఓ బిట్‌ను లిరికల్ మోషన్ పోస్టర్‌గా రిలీజ్ చేశారు.

Adipurush: ‘ఆదిపురుష్’లో ఆ సీక్వెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందట..!

‘జై శ్రీరామ్’ అంటూ సాగే ఈ పాట వింటుంటే ప్రతిఒక్కరికీ గూస్‌బంప్స్ రావడం ఖాయం. ఇక ఈ లిరికల్ మోషన్ పోస్టర్‌లో ప్రభాస్ శ్రీరాముడిగా విల్లును ఎక్కుపెడుతున్న సీన్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందించగా, త్వరలోనే ఈ మూవీ నుండి మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు ఆదిపురుష్ టీమ్ రెడీ అయ్యింది. ఈ మూవీలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోండగా, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. టీసిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆదిపురుష్ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ చేసేందకు మేకర్స్ రెడీ అయ్యారు.