Pakka Commercial: గోపీచంద్.. వైష్ణవ్ తేజ్ రిలీజ్ వార్.. గెలిచేదెవరో?
మొన్నటి వరకు కరోనాతో సతమతమైన సినిమాలన్నీ ఇప్పుడు వరసపెట్టి థియేటర్లలో దిగిపోతున్నాయి.

Pakka Commercial
Pakka Commercial: మొన్నటి వరకు కరోనాతో సతమతమైన సినిమాలన్నీ ఇప్పుడు వరసపెట్టి థియేటర్లలో దిగిపోతున్నాయి. ఇప్పటికే బడా బడా సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద దడ పుట్టిస్తుంటే.. కాస్త ఛాన్స్ దొరికితే చాలు దూరిపోవాలని మిగతా హీరోలు తమ సినిమాలతో రెడీగా ఉన్నారు. అలా ఉన్న వాళ్ళలో కొందరి మధ్య అనుకోకుండానే పోటీలు నెలకొని బాక్సాపీస్ వద్ద రిలీజ్ వార్ పేస్ చేస్తున్నారు. అలాంటి వారిలో గోపిచంద్-వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు.
Pakka Commercial: ఏంజెల్ రాశిఖన్నా.. మేకర్స్ స్పెషల్ విషెష్!
గోపీచంద్ నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. ఈ హీరోకు వరస ప్లాపుల తర్వాత రాబోతున్న ఈ సినిమాను మెగా కాంపౌండ్ జీఏ2 పిక్చర్స్ తో పాటు యేవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మించగా.. మారుతి డైరెక్ట్ చేశాడు. గతంలో జిల్ లాంటి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన రాశిఖన్నా ఇందులో మరోసారి గోపీతో జతకట్టింది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా జూలై 1న రిలీజ్ చేయాలని ఫైనల్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు.
Pakka Commercial : పోస్టర్లోనూ మారుతి మార్క్! మే 20న మ్యాచో స్టార్ సినిమా..
ఇక, ఉప్పెన సినిమాతో తొలి సక్సెస్ కొట్టిన వైష్ణవ్ తేజ్ కొండ పొలం ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో మరోసారి ప్రేమకథనే నమ్ముకుని రంగ రంగ వైభవంగా రాబోతున్నాడు. అర్జున్ రెడ్డి తమిళ సినిమా ఆదిత్య వర్మకు దర్శకత్వం వహించిన గిరీషాయ ఈ సినిమాతో తెలుగులో అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా కూడా రెండు మూడు వాయిదాలు పడి చివరికి జూలై 1కి ఫిక్సయిపోయింది.
Ranga Ranga Vaibhavanga ఫస్ట్ సింగిల్.. తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో!
దీంతో ఇలా గోపీచంద్, వైష్ణవ్ తేజ్ మధ్య పోటీ నెలకొంది. ఇద్దరు హీరోలకు ఈ సక్సెస్ అవసరం కాగా.. ఈ సినిమాల దర్శకులకు కూడా ఈ సినిమాలు అంతే అవసరం. అందులో పక్కా కమర్షియల్.. అన్ని ఎలిమెంట్స్ జత చేసి మారుతి మార్క్ సినిమాగా రాబోతుండగా.. రంగరంగ వైభవంగా కంప్లీట్ లవ్ రొమాన్స్ సినిమాగా రాబోతుంది. దీంతో ఇందులో ఏ సినిమా విక్టరీ కొట్టి ఏ హీరోకు కమ్ బ్యాక్ ఇస్తుందో చూడాలి.