Anil Ravipudi : అనిల్‌కు మరో మెగా బంపర్ ఆఫర్..?

ఫ్యామిలీ ఓరియంటెడ్‌ స్టోరీతో కుటుంబంతో సహా సినిమాలు చూసేలా మూవీస్‌ తీయటం అనిల్ (Anil Ravipudi) స్టైల్‌

Anil Ravipudi : అనిల్‌కు మరో మెగా బంపర్ ఆఫర్..?

Gossip Garage Anil Ravipudi gets another mega bumper offer

Updated On : January 15, 2026 / 4:35 PM IST

Anil Ravipudi : పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు.. ఇలా వరుస విజయాలు. మూడు హ్యాట్రిక్స్‌ కొట్టిన సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్, వచ్చే సంక్రాంతికి కూడా ఇప్పటినుంచే రెడీ అవుతున్నాడట.

మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్‌ స్టోరీతో కుటుంబంతో సహా సినిమాలు చూసేలా మూవీస్‌ తీయటం అనిల్ స్టైల్‌. ఆడియన్స్‌ కూడా ఆయన మార్క్‌ స్టోరీ లైనప్‌కు, కామెడీకి ఫిదా అవుతున్నారు. అందుకే ప్రతి స్టార్ హీరో కూడా అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారుట.

Sridevi Vijaykumar : శ్రీదేవి విజ‌య్‌కుమార్ సంక్రాంతి సంబరాలు.. ఫోటోలు వైర‌ల్‌

తక్కువ టైమ్‌లో ఫాస్ట్‌గా సినిమా చేసి హిట్ కొడుతున్న అనిల్ రావిపూడికి ఇంకో బంఫర్ ఆఫర్ వచ్చినట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. మెగా కాంబో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌, రామ్‌చరణ్‌తో షార్ట్ టైమ్‌లో అంటే వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ఓ స్టోరీ చెప్పమని ఆఫర్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మన శంకర వర ప్రసాద్‌ సినిమా స్క్రిప్ట్ వర్క్ కేవలం 25 రోజుల్లో ఫినిష్ చేసిన అనిల్‌కు ఇది పెద్ద కష్టం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు వచ్చే సంక్రాంతికి ఒకే స్క్రీన్ మీద చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్‌ అల్లరిని ఎంజాయ్ చేసే అవకాశం దక్కుతుందని అంటున్నారు. మరి అనిల్‌ మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన లేటెస్ట్‌ ఆఫర్‌లో నిజమా కాదా అనేది ఆయనే క్లారిటీ ఇవ్వాలి.