జక్కన్నకు పోటీగా అట్లీ..?

జక్కన్నకు ఓ యంగ్ డైరెక్టర్‌ పోటీగా వస్తున్నారా.?

జక్కన్నకు పోటీగా అట్లీ..?

Gossip Garage Atlee to compete with Rajamouli

Updated On : December 20, 2024 / 12:29 PM IST

Gossip Garage : జక్కన్నకు ఓ యంగ్ డైరెక్టర్‌ పోటీగా వస్తున్నారా.? రాజమౌళి డైరెక్షన్‌ను సవాల్‌ చేస్తున్నాడా.. జక్కన్నను బీట్ చేసే దర్శకుడు దిగిపోయాడా.. జక్కన్నతో పోటీయా.. అది కూడా యంగ్‌ డైరెక్టరా అంత సీన్ లేనే లేదంటారా! కానీ జక్కన్న విజువల్ వండర్‌కు మించి చూపిస్తానని చెబుతున్నాడట ఆ యంగ్ డైరెక్టర్‌. మరి ఆ దర్శకుడు ఎవరు.. ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి..?

ఎస్.ఎస్. రాజమౌళి విజువల్ వండర్ గురించి వేరే చెప్పనక్కరలేదు. ఈగతో కూడా రికార్డ్‌లు క్రియేట్ చేసిన ఘనత ఆయన సొంతం. కథలో, విజువలైజేషన్‌లో ఎక్కడ కూడా రాజమౌళి అంత ఈజీగా కాంప్రమైజ్ కాడు. అందుకే టెక్నీషియన్స్‌ని కూడా హాలీవుడ్‌ నుంచి రప్పిస్తాడు.

Zebra OTT Streaming : ఓటీటీలోకి వ‌చ్చేసిన స‌త్య‌దేవ్ జీబ్రా.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

ఇప్పుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి సినిమాలకు మించి బొమ్మ పడేస్తానంటున్నాడు తమిళ దర్శకుడు అట్లీ. ఇప్పుటికే ఈయన రాజా రాణి, థెరి, మెర్సిల్, బిగిల్ లాంటి సినిమాలు చేసి సూపర్ డూపర్‌ హిట్లు కొట్టాడు. ఇక షారుఖ్‌ఖాన్‌తో జవాన్ మూవీ తీసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ సినిమా ఏకంగా 12వందల కోట్లు రాబట్టింది. ఇక అప్పటి నుంచి అట్లీ పేరు నేషనల్‌ లెవల్లో మార్మోగుతోంది.

ఇదిలా ఉండగా డైరెక్టర్ అట్లీ తన నెక్ట్స్ మూవీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ప్రకటించేశారు. దీంతో అట్లీ నెక్ట్స్ మూవీపై అనౌన్స్ రాకముందే స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది.

Mufasa : ‘ముఫాసా’ మూవీ రివ్యూ.. మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమా ఎలా ఉందంటే..?

ఇక అప్పటి నుంచి అట్లీ 6వ ప్రాజెక్ట్ రాజమౌళి సినిమాకు సవాల్‌ విసిరేలా వస్తుందంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ఇటు రాజమౌళి కూడా తన నెక్ట్స్ మూవీ పాన్ వరల్డ్ అంటున్నారు. ఇప్పడు అట్లీ కూడా పాన్ వరల్డ్ జపం చేస్తూ.. టెక్నీషియన్లను హలీవుడ్ నుంచి తీసుకువస్తున్నారట. అంతే కాదు రాజమౌళి సినిమా కంటే ముందే.. సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అట్లీ ఆతృతగా ఉన్నారట. ఇన్నాళ్లకి రాజమౌళికి సరితూగే డైరెక్టర్ దిగిపోయాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ పోటీలో నెగ్గేదెవరో.. తగ్గేదెవరో ప్రూవ్ చేయాల్సింది వాళ్ల సినిమాలే.

అయితే.. అట్లీ నెక్స్ మూవీ.. తెలుగు స్టార్స్‌తోనే ఉంటుందట. జూనియర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌తో అట్లీ సినిమాలంటూ ఓ గాసిప్ అన్ని ఇండస్ట్రీల్లో మోతమోగిస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో కొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది.