Fan War: ఫ్యాన్ వార్‌పై బాలయ్య, పవన్ సీరియస్? అసలు అభిమానులు పెడుతున్న చిచ్చు ఏంటి..
ఈ సోషల్ మీడియా వార్ కాస్త ఇటు బాలయ్య..అటు పవన్ దృష్టికి వెళ్లినట్టు టాక్. దీంతో తమ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవపడటం చూసి..
Fan War: ఇటు అఖండ. అటు అజ్ఞాత వాసి. ఒకరిది మెగా కాంపౌండ్. మరొకరిది నందమూరి కోటరీ. వారిద్దరు రూట్ వేరు. వాళ్ల తీరు కూడా సెపరేటు. కానీ అనుకోని, అవసరం లేని రచ్చ ఆ ఇద్దరికి హెడెక్‌గా మారుతోందట. కొందరు ఫ్యాన్స్ చేస్తున్న అతి.. ఇటు బాలయ్యకు, ఇటు పవన్‌కు చిరాకు తెప్పిస్తుందట. అసలు ఫ్యాన్స్ పెడుతున్న చిచ్చు ఏంటి? అగ్ర హీరోల రియాక్షన్ ఎలా ఉంది?
ఇద్దరు అగ్రహీరోలు. అంతే కాదు కూటమి మిత్రులు. అటు పవన్..ఇటు బాలయ్య. ఇద్దరు పాలిటిక్స్‌లో ఉన్నారు. పైగా పవన్ ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పోస్ట్‌గా ఉండగా..బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే కొందరు చేస్తున్న అతికి ఈ ఇద్దరు హీరోలు..తమకు సంబంధం లేకపోయినా ఇబ్బంది పడాల్సి వస్తోందట. దీనికి పుల్ స్టాప్ పెట్టాలని తమ ఫ్యాన్స్ అసోసియేషన్స్‌కు చురకలు అంటించారట ఆ ఇద్దరు పెద్ద హీరోలు.
హరిహర వీరమల్లు రిలీజ్ దాదాపు మూడు సార్లు వాయిదా పడటంతో బాలయ్య ఫ్యాన్స్ పవన్ టార్గెట్‌గా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారట. కనీసం తన సినిమాను అనకున్న టైమ్‌కు రిలీజ్ చేసుకోలేకపోతున్నాడంటూ పోస్ట్‌లు పెట్టారట. దీంతో పవన్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వటం..తిరిగి కౌంటర్లు ఇవ్వటం చేశారు.
ఇప్పుడు అఖండ-2 రిలీజ్ ఆల్ ఆఫ్ సడెన్‌గా వాయిదా పడటంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. హరిహర వీరమల్లు రిలీజ్ టైమ్‌లో పవన్ ముందుకు వచ్చి నిర్మాతకు నష్టం కలగకుండా జోక్యం చేసుకుని సినిమా రిలీజ్ చేయించాడని..కానీ బాలయ్య ఎందుకు రావటం లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వార్ కాస్త ఇటు బాలయ్య..అటు పవన్ దృష్టికి వెళ్లినట్టు టాక్. దీంతో తమ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవపడటం చూసి ఇది ఎక్కడ దాకా పోతుందోనని ఫ్యాన్స్ గ్రూప్స్‌ను సైలెంట్‌గా ఉండాలని కాస్త గట్టిగానే చెప్పారని టాక్. బాలయ్య..పవన్ మాటలను విని ఫ్యాన్స్ ట్రోల్స్‌ను ఆపుతారా లేదా చూడాలి.
Also Read: అఖండ 2 బాటలోనే రాజాసాబ్?.. సంక్రాంతికి రిలీజ్ కష్టమేనా?.. ఆందోళనలో ఫ్యాన్స్..
