Gummadi Narsaiah : ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్.. టైటిల్ లోగో లాంచ్ చేసిన సుకుమార్..

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు గుమ్మడి నర్సయ్య..

Gummadi Narsaiah : ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్.. టైటిల్ లోగో లాంచ్ చేసిన సుకుమార్..

Gummadi Narsaiah

Updated On : July 31, 2021 / 6:04 PM IST

Gummadi Narsaiah: కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్న నాయకులను చూస్తున్నాం. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య.

Gummadi Narsaiah

 

శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. టైటిల్ లోగో విడుదల చేసిన అనంతరం దర్శకుడు సుకుమార్ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈతరంతో పాటు రాబోయే తరాల ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిసేలా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఉండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

Gummadi Narsaiah