Assam : ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూడటానికి.. గవర్నమెంట్ ఉద్యోగులకు హాఫ్ డే సెలవు..

‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాకి మరింత సపోర్ట్ ఇవ్వడానికి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. తాజాగా అస్సాం ప్రభుత్వం ఈ సినిమాని మరింత సపోర్ట్ చేస్తూ......

Assam : ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూడటానికి.. గవర్నమెంట్ ఉద్యోగులకు హాఫ్ డే సెలవు..

Assam

Updated On : March 16, 2022 / 9:25 AM IST

The Kashmir Files :  ఇటీవల మార్చ్ 11న రిలీజైన ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా అంచనాలకి మించి భారీ విజయం సాధిస్తుంది. కాశ్మీర్ పండిట్లు, హిందువులపై జరిగిన మారణకాండ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. దేశంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమాని చూసి అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నరేంద్రమోడీ సైతం ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని పిలిచి అభినందించారు. ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిర్మించగా బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు.

ఈ సినిమాకి మరింత సపోర్ట్ ఇవ్వడానికి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. ఇప్పటికే చాల రాష్ట్రాలలో ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చారు. తాజాగా అస్సాం ప్రభుత్వం ఈ సినిమాని మరింత సపోర్ట్ చేస్తూ ప్రమోట్ కూడా చేస్తుంది. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాని చూడటానికి గవర్నమెంట్ ఉద్యోగులకి హాఫ్ డే సెలవుని ప్రకటించింది అస్సాం ప్రభుత్వం.

Hacking : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరుతో మాల్‌వేర్‌‌లు… హెచ్చరిస్తున్న పోలీసులు..

ఈ మేరకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ”మన ప్రభుత్వ ఉద్యోగులకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూడటానికి హాఫ్ డే సెలవు ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఉద్యోగులు వారిపై అధికారులకి తెలియచేసి సెలవు తీసుకోవచ్చు. మీరు ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూడటానికి ప్రభుత్వం మంజూరు చేసిన సెలవు తీసుకోవచ్చు కానీ సినిమా చూసి టికెట్స్ ని మీ పై అధికారులకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది” అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పోస్ట్ చేశారు. దీనిపై అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.