HanuMan : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో.. హనుమాన్ టీం.. పిక్ వైరల్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో హనుమాన్ టీం భేటీ. సినిమా అనేది మన సాంస్కృతిక వారసత్వం..

HanuMan : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో.. హనుమాన్ టీం.. పిక్ వైరల్

HanuMan director Prasanth Varma hero Teja sajja met UP CM Yogi Adityanath

Updated On : January 24, 2024 / 4:48 PM IST

HanuMan : రామ భక్త హనుమాన్‌ని సూపర్ హీరోగా ప్రపంచానికి పరిచయం చేస్తూ.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘హనుమాన్’. తేజ సజ్జ వంటి చిన్న హీరోతో చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ చిన్న సినిమా నేషనల్ వైడ్ సంచలనం సృష్టించింది. కలెక్షన్స్ పరంగా రెండు వందల కోట్ల మార్క్ ని కూడా దాటేసి మూడు వందల మార్క్ వైపు పరుగులు పెడుతుంది.

కాగా ఈ మూవీకి నార్త్ సైడ్ మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. ప్రస్తుతం అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవం కూడా జరగడంతో.. హనుమాన్ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఇక ఈ సినిమా చూసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. హనుమాన్ మూవీ టీంని అభినందించారు. ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జ యోగి ఆదిత్యనాథ్‌ని ఆయన కార్యాలయంలోనేడు కలుసుకున్నారు.భారతీయ చరిత్ర అంశాలను ఆకర్షణీయమైన సూపర్‌హీరో కథనంలో విజయవంతంగా చూపించిన ప్రశాంత్‌ వర్మని యోగి ఆదిత్యనాథ్‌ అభినందించారు.

Also read : Ram Charan : రామ్‌చరణ్ నన్ను కొట్టి.. తరువాత సారీ చెప్పారు.. యాక్టర్ సూర్య కామెంట్స్

ఇక సీఎంతో భేటీ అనంతరం ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. “యోగి జీని కలవడం నిజంగా నాకెంతో గౌరవం మరియు మర్చిపోలేని సందర్భం. భారతీయ ఇతిహాసాలతో సూపర్ హీరో కాన్సెప్ట్ ని కలిపి కథను చెప్పడం పట్ల ఆయన ప్రోత్సహించారు. సినిమా అనేది మన సాంస్కృతిక వారసత్వం అని, దాని ఎలా కాపాడుకోవాలో ఆయన మాతో చర్చించారు. సినిమాల్లో సంప్రదాయం మరియు కొత్త ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించే నాయకుడు ఉండటం ఎంతో సంతోషకరమైన విషయం. ఆయన ప్రోత్సాహం కొత్త ప్రయత్నాలు కొనసాగించడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది” అంటూ పేర్కొన్నారు.

అలాగే తేజ సజ్జ కూడా మాట్లాడుతూ.. “యోగి జీని కలవడం ఎంతో గౌరవంగా ఉంది. హనుమాన్ గురించి, మన సంస్కృతి గురించి యోగి జీ మాట్లాడిన మాటలు నాలో అపారమైన గర్వాన్ని నింపింది” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.