‘తెల్లవారితే గురువారం’, ‘భాగ్ సాలే’ అంటున్న శ్రీ సింహా..

‘తెల్లవారితే గురువారం’, ‘భాగ్ సాలే’ అంటున్న శ్రీ సింహా..

Updated On : February 23, 2021 / 1:10 PM IST

Sri Simha Koduri: ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు, యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడు, యువ నటుడు, తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సింహా కోడూరి పుట్టినరోజు నేడు..

ఈ సందర్భంగా సింహా నటిస్తున్న కొత్త సినిమా ‘తెల్లవారితే గురువారం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పెళ్లి కొడుకు గెటప్‌లో, ముఖం మీద గాయంతో సిగరెట్ వెలిగిస్తూ శ్రీ సింహా లుక్ ఆకట్టుకుంటోంది. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాల భైరవ సంగీతమందిస్తున్నాడు.

Thellavarithe Guruvaram

శ్రీ సింహా బర్త్‌డే సందర్భంగా ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ‘భాగ్ సాలే’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ‘బిజినెస్ మెన్’ సినిమాలో ‘భాగ్ సాలే’ అనే థీమ్ సాంగ్ ఏ స్థాయిలో పాపులర్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాల భైరవ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

Bhaag Saale