‘జన్మనిచ్చిన అమ్మకి జన్మదిన శుభాకాంక్షలు’.. మెగాస్టార్ చిరంజీవి..

Anjana Devi: శుక్రవారం (జనవరి 29)న మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవీ గారి పుట్టినరోజు.. ఈ సందర్భంగా చిరు సోషల్ మీడియా వేదికగా అంజనా దేవి గారికి ప్రేమ పూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
చిరంజీవి నటించిన ‘డాడీ’ చిత్రంలోని గుమ్మడి గుమ్మడి అనే బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ బీజీఎమ్‌తో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంజనా దేవి గారితో కలిసి ఉన్న అపురూప క్షణాలను.. అరుదైన ఫొటోలను వీడియో రూపంలో షేర్ చేశారు మెగాస్టార్.
జన్మనిచ్చిన అమ్మకి జన్మ దిన శుభాకాంక్షలు! #HappyBirthdayAmma pic.twitter.com/3f9sZg5PXy
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2021