Ustaad Bhagat Singh : మళ్ళీ లైన్లోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.

Ustaad Bhagat Singh : మళ్ళీ లైన్లోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..

Harish Shankar Gives Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Shooting Update

Updated On : May 22, 2025 / 1:41 PM IST

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఇటీవల తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసేయడానికి వరుసగా డేట్స్ ఇస్తున్నాడు. హరిహర వీరమల్లు పూర్తవగా ఇప్పుడు పవన్ OG షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇక అసలు సినిమానే ఉండదేమో అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంటుందని ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. కేవలం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేతులు మాత్రమే కనపడేలా ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ ఫ్యాన్స్ కోసం, మూవీ లవర్స్ కోసం రాబోతుంది, త్వరలోనే షూటింగ్ మొదలవ్వబోతుంది అని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పక్కాగా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.

Also Read : Vijay Sethupathi : పూరి జగన్నాధ్ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఎప్పట్నుంచి అంటే.. టైటిల్ పై కూడా క్లారిటీ..

గతంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు కాబట్టి ఈ సినిమాపై కూడా అంచనాలే ఉన్నాయి. అయితే గతంలోనే కొంత షూట్ చేసి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా తేరి రీమేక్ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు కథ అంతా మార్చేసి మళ్ళీ కొత్తగా షూట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.