BalaKrishna : అసెంబ్లీలో బాలయ్య విజిల్ వేసిన టాపిక్‌.. అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడిన హరీష్ శంకర్..

ఇటీవల ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ విజిల్ వేసిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా అన్‌స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ లో ఆ విజిల్ టాపిక్‌ని హరీష్ శంకర్ ప్రస్తావించారు.

BalaKrishna : అసెంబ్లీలో బాలయ్య విజిల్ వేసిన టాపిక్‌.. అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడిన హరీష్ శంకర్..

Harish Shankar indirect comments about Balakrishna Vijil in assembly

Updated On : December 23, 2023 / 6:29 PM IST

BalaKrishna : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడో సీజన్ జరుగుతుంది. ఇక ఈ సీజన్ కొత్త ఎపిసోడ్‌కి గెస్ట్‌లుగా సీనియర్ నటి సుహాసిని, శ్రియ, డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్‌ని తీసుకువచ్చారు బాలయ్య. కాగా ఈ ఎపిసోడ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఒక టాక్ షోలా కాకుండా అవార్డుల ఫంక్షన్ లా నడిపించారు. మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన గెస్ట్‌లకు పలు క్యాటగిరీల్లో అవార్డుల ప్రకటించడం అనే కాన్సెప్ట్ తో సాగింది.

ఇక ఎపిసోడ్ చివరిలో ఒక సెలబ్రిటీ వాయిస్ ని వినిపిస్తారు. అది విని ఎవరో చెప్పాలి. ఆ వాయిస్ ని ముందుగా ఎవరు కనిపెడతారో.. వాళ్ళు విజిల్ వేసి తమ సమాధానం తెలియజేయాలి. ఈ క్రమంలోనే ప్రభాస్ వాయిస్ వెయ్యగా.. హరీష్ శంకర్ విజిల్ వేయకుండా ఆన్సర్ చెప్పారు. హరీష్ విజిల్ వేసి సమాధానం చెప్పినా బాలయ్య తనని విన్నర్ అని ప్రకటించడం లేదు. దీంతో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “అన్యాయం జరిగినప్పుడు విజిల్ వెయ్యాలి అని నేర్చుకున్నది మీ దగ్గర నుంచే” అని చెబుతూ అసెంబ్లీలో విజిల్ వేసిన విషయాన్ని గుర్తు చేసేలా వ్యాఖ్యానించారు.

Also read : సలార్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాలీవుడ్‌కి మళ్ళీ టెన్షన్..

ఇటీవల ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ విజిల్ వేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ విషయం అప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలో హరీష్ శంకర్ ఆ విషయానికి గుర్తు చేసేలా వ్యాఖ్యానించడంతో.. మరోసారి ఆ విజిల్ విషయం వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే, ఈ టాక్ షోకి మహేష్ బాబు మరోసారి రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సీజన్ కి గ్రాండ్ ఎండింగ్ ఇవ్వడానికి మహేష్ గెస్ట్ గా వచ్చారు. కాగా మహేష్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే మహేష్ అన్‌స్టాపబుల్ షోకి అతిథిగా రాబోతున్నారట. మహేష్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరుకాబోతున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.