Happy Birthday రానా: ‘విరాటపర్వం’ ఫస్ట్ లుక్ విడుదల

రానా దగ్గుబాటి బర్త్ డే సందర్భంగా ఈ రోజు (డిసెంబర్ 14, 2019)న విరాటపర్వం నుంచి రానా ఫస్ట్ లుక్ విడుదల చేసింది మూవీ టీం. ఈ సినిమాకు నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
విరాటపర్వం ఫస్ట్ లుక్ లో రానా ముఖానికి ఎర్రటి క్లాత్ కట్టుకుని కనిపించాడు. పోస్టర్‌పై ” Revolution Is An Act Of Love” అని రాసి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె నక్సలైట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. వీరితో పాటు మలయాళ నటి నందితా దాస్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక జనవరి 2020 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Happy birthday @RanaDaggubati . Wishing you tremendous success the year ahead. pic.twitter.com/5md3jgwfvc
— Anil Sunkara (@AnilSunkara1) December 14, 2019