NTR : ఎన్టీఆర్‌తో పాటు అలియాకు కూడా అవార్డు పంపిస్తున్నాం.. HCA ట్వీట్!

ఇటీవల HCA అవార్డుల రేస్ లో నిలిచిన RRR మూవీ మొత్తం 5 అవార్డులను అందుకుంది. ఈ క్రమంలోనే అవార్డుల వేడుకకు హాజరయిన రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డుని అందుకున్నాడు. తారకరత్న మరణం వలన ఎన్టీఆర్ అవార్డ్స్ కి వెళ్లకపోవడం, ఎన్టీఆర్ కి కూడా అవార్డు ఉంది అంటూ HCA ప్రకటించక పోవడంతో..

NTR : ఎన్టీఆర్‌తో పాటు అలియాకు కూడా అవార్డు పంపిస్తున్నాం.. HCA ట్వీట్!

HCA awards tweeted a award is sent to ntr for rrr movie

Updated On : March 3, 2023 / 2:47 PM IST

NTR : ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టార్రర్ చిత్రం ‘RRR’. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియా, సముద్రఖని వంటి స్టార్స్ నటించారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది కావొస్తున్నా ఈ మూవీ మానియా నుంచి వరల్డ్ మూవీ లవర్స్ బయటకి రాలేకపోతున్నారు.

Balakrishna – NTR : బాలయ్య నిజంగానే ఎన్టీఆర్‌ని దూరం పెడుతున్నాడా.. రామ్‌చరణ్ చెప్పిన నిజమేంటి?

ఇక పలు ఇంటర్నేషనల్ అవార్డుల్లో స్థానం దక్కించుకుంటున్న ఈ చిత్రం.. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఈ క్రమంలోనే ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా అందుకుంది. ఇటీవల HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డుల రేస్ లో నిలిచిన RRR మూవీ.. ‘బెస్ట్‌ స్టంట్స్‌’, ‘బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’, ‘బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌’, ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్’, ‘స్పాట్ లైట్’ అవార్డుతో కలిపి మొత్తం 5 అవార్డులను అందుకుంది.

కాగా స్పాట్ లైట్ అవార్డుని మూవీ టీం మొత్తానికి ప్రకటించారు. ఈ క్రమంలోనే అవార్డుల వేడుకకు హాజరయిన రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డుని అందుకున్నాడు. తారకరత్న మరణం వలన ఎన్టీఆర్ అవార్డ్స్ కి వెళ్లకపోవడం, ఎన్టీఆర్ కి కూడా అవార్డు ఉంది అంటూ HCA ప్రకటించక పోవడంతో.. ఎన్టీఆర్ అభిమానులు ఫీల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా HCA ని ఎన్టీఆర్ కి అవార్డు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. దానికి స్పందించిన HCA.. ఎన్టీఆర్ కి కూడా అవార్డు ఉంది. త్వరలోనే ఆయనికి దానిని పంపిస్తాం అంటూ ట్వీట్ చేశారు.

తాజాగా ఆ అవార్డులను పంపిస్తున్నట్లు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. సినిమాలో నటించిన ఎన్టీఆర్ అండ్ అలియా భట్ కి స్పాట్ లైట్ అవార్డుని వచ్చే వారం పంపిస్తున్నాము అంటూ అవార్డు ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా RRR నాటు నాటు సాంగ్ ఆస్కార్ రేస్ లో ఉన్న విషయం తెలిసిందే. మార్చి 12న ఈ అవార్డుల వేడుక జరగనుంది. మరి RRR ఆస్కార్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేస్తుందా? లేదా? చూడాలి.