Dulquer Salmaan: నాపై కూడా ఆలాంటి విమర్శలు.. నిజంగా భయమేస్తుంది.. నాలా ఎవరూ నటించలేరు..
దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కాంత. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన(Dulquer Salmaan) ఈ పీరియాడిక్ థిల్లర్ మూవీలో సముద్రఖని, రానా, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషించారు.
Hero Dulquer Salmaan makes shocking comments on criticism against him
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కాంత. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ థిల్లర్ మూవీలో సముద్రఖని, రానా, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషించారు. ఎట్టకేలకు ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Dulquer Salmaan)టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. ఇందులో భాగంగా ఆయన తనపై వచ్చిన విమర్శల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Pooja Hegde: బ్యాక్ లుక్ లో కేకెపెట్టిస్తున్న పూజ హెగ్డే.. ఫోటోలు
చాలా కాలంగా నాపై కూడా చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. నా నటన గురించి మాట్లాడతారు. అసలు ఇతనికి నటన రాదు అంటారు. నిజంగా నేను బాగానే నటిస్తున్నానా అని చెక్ చేసుకుంటాను. అవి చూసినప్పుడు నాకు భయమేస్తుంది. కానీ, ఆ కామెంట్స్ ని పాజిటీవ్ గా మలుచుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇంకా కష్టపడతాను. ఈ పాత్ర దుల్కర్ తప్పా ఇంకెవరు చేయలేరు అనేలా నా నటనను ఇంప్రూవ్ చేసుకుంటాను”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక కాంత సినిమా తరువాత దుల్కర్ మరో తెలుగు సినెమా చేస్తున్నాడు. అదే “ఆకాశంలో ఒక తార”. పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దుల్కర్ సల్మాన్ లుక్ కి మంచి క్రేజ్ రాగా అదే రేంజ్ లో సినిమా కూడా ఉంటుంది అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
